They Call Him OG Trailer : ఓ.జి ట్రైలర్.. తలలు జాగ్రత్త

They Call Him OG Trailer :  ఓ.జి ట్రైలర్.. తలలు జాగ్రత్త
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మూవీ ఓ.జి. ఈ 25న విడుదల కాబోతోన్న ఓ. జి ట్రైలర్ విడుదలైంది. ఊహించినట్టుగానే దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ ను ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేశాడు అనిపిస్తోంది. 80ల కాలం నాటి కథాంశంతో రూపొందిన సినిమా ఇది. ముంబై గ్యాంగ్స్ స్టర్స్ కు సంబంధించిన కథ. పవన్ కూడా ఓ గ్యాంగ్ స్టర్ గానే నటించాడు.. అని ముందు నుంచీ చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం వచ్చిన టీజర్ తోనే భారీ హైప్ క్రియేట్ అయింది. అందుకే సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ అయ్యేలానే ఉందీ ట్రైలర్.

‘బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్లీ మొదలయ్యాయి. కానీ ఈ సారి గన్స్ అన్నీ సత్యదాదావైపు తిరిగాయి.. దాదా వరకూ వెళ్లారు అంటే పరిస్థితి చేజారిపోతున్నట్టుంది.. వాడి ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే..’ అనే వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ ఆద్యంతం ఓ కొత్త మూడ్ ను క్రియేట్ చేశాయి. పవన్ ఎంట్రీ తో ట్రైలర్ నెక్ట్స్ లెవల్ కు వెళ్లింది. ‘నిన్ను కలవాలని కొందరు.. చూడాలని ఇంకొందరు.. చంపాలని అందరూ ఎదురుచూస్తున్నారు..’ అనే డైలాగ్ హీరో ఎంతటి పవర్ ఫుల్ అనేది తెలుపుతుంది. ఆ వెంటనే మంటల్లో ఉన్న ఫోన్ ఇమ్రాన్ హష్మీ ఎత్తగానే.. ‘బాంబే వస్తున్నా.. తలలు జాగ్రత్త’ అంటూ పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే.. సుజీత్ వంటకం ఈ సారి మామూలుగా ఉండదు అనిపిస్తోంది.

ఈ ట్రైలర్ కు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే థమన్ నేపథ్య సంగీతం మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. మొత్తంగా చెప్పిన టైమ్ కు ట్రైలర్ రాకపోయినా వచ్చిన టైమ్ లో మాత్రం అద్దిరిపోయింది అనేలా ఉందనే చెప్పాలి.

Tags

Next Story