Thiruveer Bhagavanthudu : తిరువీర్ భగవంతుడు వస్తున్నాడు

Thiruveer Bhagavanthudu :  తిరువీర్ భగవంతుడు వస్తున్నాడు
X

కొన్ని సినిమాల కోసం ప్రేక్షకులు అదే పనిగా ఎదురుచూస్తుంటారు. ఇలాంటి మూవీస్ ఖచ్చితంగా చూడాల్సిందే అనిపించేలా ఉంటారు. ముఖ్యంగా టైటిల్ నుంచే మూవీస్ ఆకట్టుకుంటాయి అంటే చిన్న విషయమేం కాదు. అలాంటి మూవీని ‘భగవంతుడు’. తిరువీర్ హీరోగా జిజి విహారి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ఇది. కాస్త ఆలస్యం అయినా లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా ఈ మూవీ రాబోతోంది. ఈ మూవీపై ఇండస్ట్రీలో కూడా టాక్ ఆఫ్ ద టౌన్ గా ఉంది. ఈ తరహా సినిమాలకు ఇప్పుడు మంచి ట్రెండ్ కూడా నడుస్తోంది. వాస్తవ సంఘటనల నేపథ్యంలో అల్లుకున్న కథలా అనిపిస్తోందీ మూవీ పోస్టర్ చూడగానే.

తలపై కొమ్ములు, ఒక శూలం, పక్కనే కత్తి కూడా ఉండేలా పోస్టర్.. ఆ పోస్టర్ మధ్యలో డప్పు కనిపిస్తుంది. ఇది సింపుల్ గా ఉన్నట్టు కనిపిస్తున్నా ఒక బలమైన కథ కూడా ఉండబోతోంది అనిపించేలా ఉంది. జిజి విహారి దర్శకుడుగా ఇది మొదటి సినిమా. కానీ కథనం మాత్రం చాలా సీనియర్ దర్శకుడుగా ఉండబోతోంది అనేలా ఉంది. ఇక రీసెంట్ గా తిరువీర్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో లాంటి హిట్ మూవీ ఇచ్చాడు. ఇది కూడా భగవంతుడుకు ప్లస్ అవుతుంది. అతనితో పాటు ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోందీ మూవీలో. రిషి, రవీందర్ విజయ్, కాలకేయ ప్రభాకర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ఇక భగవంతుడు మూవీ టీజర్ ఈ నెల 30న విడుదల కాబోతోంది. మరి ఈ టీజర్ తర్వాత ఈ మూవీ టాక్ ఆఫ్ ద టౌన్ కాబోతోంది అనిపించేలా ఉంది. మరి అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Tags

Next Story