Kantara: కాంతారాపై కామెంట్స్.. రిషబ్ శెట్టి స్పందన

Kantara: విడుదలైన అన్ని చోట్లా బ్రహ్మరథం పడుతుంటే ఎక్కడో ఒక చోట విమర్శించే వారు కూడా ఉంటారు. అలాంటి వాటికి స్పందించకపోవడమే మంచిది. వారికి ప్రేక్షకులే సమాధానం చెబుతారు అని చాలా కూల్‌గా స్పందించారు కాంతారా హీరో రిషబ్ శెట్టి. విమర్శలపై ఎలాంటి కామెంట్ చేయదల్చుకోలేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రిషబ్.
ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తే ఏ హీరో నటిస్తే బావుంటుంది అని అడగ్గా.. ఈ చిత్రం సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించినది.. వాటినన్నింటిని అర్థం చేసుకుని నటించాల్సి ఉంటుంది. బాలీవుడ్‌లో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. వారందరిని అభిమానిస్తాను.
అయినా రీమేక్ సినిమాలపై ను అంత ఆసక్తి లేదు అని పేర్కొన్నారు. కాంతారా బాలీవుడ్‌లోనూ దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.50కోట్లు రాబట్టింది. ప్రేక్షకుల ఆదరణను దృష్టిలో ఉంచుకొని మరికొన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com