This Friday Theatre Releases : ఈ ఫ్రైడే క్లియరెన్స్ సేల్ లా మారిందా..

ఎప్పటి నుంచో విడుదల కాకుండా ఆగిపోయిన సినిమాలన్నీ ఏదైనా గ్యాప్ దొరికితే ఒకేసారి పొలోమని విడుదలవుతుంటాయి. వీళ్లకు ఆ టైమ్ రావడమే ఇంపార్టెంట్. రిజల్ట్ కాదు అన్నట్టుగా కనిపిస్తుంది పరిస్థితి. అఫ్ కోర్స్ ఇలాంటి సందర్భాల్లో కొన్ని సాలిడ్ మూవీస్ కూడా ఉంటాయి. కాకపోతే ముందూ, వెనక వారాల్లో పోటీ లేకపోయినా అంతా కూడబలుక్కున్నట్టుగా ఒకేసారి వస్తున్నారంటే ప్రేక్షకులకు అదేదో క్లియరెన్స్ సేల్ లా కనిపిస్తుంది తప్ప.. కొత్త సినిమాలు విడుదలవుతున్నట్టుగా అనిపించదు. అలా ఈ వారం ఏకంగా అరడజను సినిమాలు విడుదలువుతున్నాయి.
అయితే అందరితో పాటూ ఎందుకు అనుకున్నారేమే.. అశ్విన్ బాబు నటించిన శివం భజేను ఒకరోజు ముందుగానే గురువారమే విడుదల చేస్తున్నారు.
ఆ తరవాత రోజు 5 సినిమాలున్నాయి. వీటిలో కాస్త ఎక్కువ తెలిసిన సినిమా అంటే అల్లు శిరీష్ నటించిన బడ్డీ కనిపిస్తోంది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ గా కనిపిస్తోన్న ఈ మూవీని తమిళ్ టాప్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా నిర్మించడం విశేషం. దర్శకుడూ తమిళ్ వాడే. సో.. రెండు భాషల్లో వస్తోంది. ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ అట్రాక్టివ్ గానే ఉంది. కాకపోతే గుంపులో వస్తుండటం కొంత మైనస్ గా మారే ప్రమాదం లేకపోలేదు.
రాజ్ తరుణ్ గత వారమే పురుషోత్తముడు అనే మూవీతో వచ్చాడు. బట్ ఈ మూవీని ఎవరూ పట్టించుకోలేదు. మళ్లీ ఏమంత గ్యాప్ లేకుండా ఈ శుక్రవారం తిరగబడర సామీ అనే మూవీతో వస్తున్నాడు. ఇది కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంది. కానీ అతని మార్కెట్ పూర్తిగా పోయిందని పురుషోత్తముడే చెప్పాడు కాబట్టి.. ఈ సామిని పట్టించుకుంటారా అంటే డౌటే.
ఇక సీనియర్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ చాలా రోజుల తర్వాత ఉషా పరిణయం అనే మూవీతో వస్తున్నాడు. ఆయన తప్ప ఈ మూవీకి వేరే అట్రాక్షన్ ఏం కనిపించడం లేదు.
అలాగే అలనాటి రామచంద్రుడు అనే మూవీతో పాటు బిచ్చగాడు తర్వాత తెలుగు మార్కెట్ పై దండయాత్ర చేస్తోన్న విజయ్ ఆంటోనీ తుఫాన్ అంటూ వస్తున్నాడు. స్ట్రాంగ్ స్టార్ కాస్ట్ ఉన్న ఈ మూవీతో మళ్లీ పెద్ద హిట్ కొడతా అంటున్నాడు విజయ్. మొత్తంగా ఇవన్నీ క్లియరెన్స్ సేల్ లా కనిపిస్తున్నాయనే కమెంట్స్ అయితే చాలానే ఉన్నాయి.
విశేషం ఏంటంటే.. జూలై 26న కేవలం మూడు సినిమాలే ఉన్నాయి. అందులో రాయన్ డబ్బింగ్ మూవీ. ఆగస్ట్ 9న ఒకట్రెండు మూవీస్ మాత్రమే ఉన్నాయి. అయినా అటూ ఇటూ అడ్జెస్ట అయ్యే అవకాశాలున్నా.. వీళ్లంతా ఆగస్ట్ 2నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో కానీ.. ఎవరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com