Junior Movie : ఈ శుక్రవారం సినిమాలేంటీ..?

Junior Movie :  ఈ శుక్రవారం సినిమాలేంటీ..?
X

ఈ వేసవి తెలుగు సినిమాల నిరాశపరిచాయి. పెద్ద సినిమాలు రాలేదు. వచ్చిన వాటిలో ఆకట్టుకున్నవి తక్కువ. కొన్ని ఓవర్ రేటెడ్ అయితే మరికొన్ని అండర్ రేటెడ్ అనిపించుకున్నాయి. ఇక ఈ శుక్రవారం కూడా కొత్త పోస్టర్స్ తో సందడి కనిపించబోతోంది. ఈ సారి కూడా చిన్నా పెద్ద సినిమాలు బరిలో నిలుస్తున్నాయి. అన్నిటికంటే ఎక్కువ ఆకట్టుకుంటోన్న మూవీ ‘జూనియర్’. కిరీటి హీరోగా పరిచయం అవుతోన్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ కావడం, జెనీలియా రీ ఎంట్రీ ఇస్తుండటం పెద్ద ప్లస్ పాయింట్స్ గా కనిపిస్తున్నాయి. వారాహి చలన చిత్ర బ్యానర్ నిర్మించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి చీఫ్ గెస్ట్ గా రావడంతో అందరి కళ్లూ జూనియర్ పై పడ్డాయి. టీజర్ ఫంకీగా ఉన్నా.. ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది. కిరీటి కర్ణాటకకు చెందిన గాలి జనార్ధన రెడ్డి కొడుకు కూడా కావడంతో మీడియా కళ్లు కూడా జూనియర్ పై కాస్త ఎక్కువగానే ఉన్నాయి.

కొన్నాళ్ల క్రితం కేరాఫ్ కంచరపాలెం అనే చిత్రంతో ఆకట్టుకున్న నిర్మాత ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా మారి తెరకెక్కించిన చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు. అంతా కొత్తవాళ్లతోనే రూపొందించిన ఈ మూవీ ప్రమోషన్స్ చేశారు కానీ ఆ స్థాయిలో ఆడియన్స్ లోకి వెళ్లిందా అంటే లేదు అనే చెప్పాలి.

ఇక తమిళ్ లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘డిఎన్ఏ’అనే చిత్రాన్ని తెలుగులో ఓ బేబీగా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అధర్వ మురళి, నిమిషా సజయన్ జంటగా నటించిన ఈ చిత్రం త్వరలోనే ఓటిటిలోకీ రాబోతోంది. పైగా అధర్వకు తెలుగులో ఎలాంటి క్రేజ్ లేదు. సో.. ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది ప్రశ్నార్థకమే.

వీటితో పాటు వీడే మన వారసుడు, పోలీస్ వారి హెచ్చరిక అనే చిత్రాలు కూడా విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాల పోస్టర్స్ భారీగా ఉన్నాయి కానీ.. ఆ పోస్టర్స్ తో తెలిసిన ఆర్టిస్టులు మాత్రం లేరు. సో.. కంటెంట్ డిసైడ్ చేసే వరకూ థియేటర్స్ లో ఉంటాయా లేదా అనేది చూడాలి. మొత్తంగా ఈ శుక్రవారం ఐదు సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిలో ఓ బేబీ డబ్బింగ్ సినిమా.

Tags

Next Story