Nithiin : నితిన్ వర్సెస్ యంగ్ స్టర్స్

ఒకరు ఆల్రెడీ ప్రూవ్ అయిన బ్యాచ్. మరొకరు ప్రూవ్ చేసుకోవాల్సిన సీనియర్. ఈ ఇద్దరి మధ్య పోటీ అంటే బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు.. ఆడియన్స్ లోనూ ఓ ఆసక్తి కనిపిస్తుంది. అందుకు ఈ నెల 28 వేదిక కాబోతోంది. నితిన్ రాబిన్ హుడ్ వర్సెస్ కొత్త కుర్రాళ్ల మ్యాడ్ 2 ఒకే రోజు పోటీ పడుతున్నాయి. కానీ ఇప్పటి వరకూ చూస్తే అందరి కళ్లూ మ్యాడ్ 2పైనే ఉన్నాయనేది నిజం. అందుకు కారణం నితిన్ కొన్నాళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉండటమే. పైగా వెంకీ కుడుముల రైటింగ్ స్టైల్ చూస్తే చాలా సిల్లీగా కనిపిస్తోంది. అవుట్ డేటెడ్ పంచ్ లే ఎక్కువగా ఉన్నాయి. అయినా సిట్యుయేషనల్ గా వర్కవుట్ అయితే రాబిన్ హుడ్ హిట్టెక్కుతాడు. శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో డేవిడ్ వార్నర్ కేమియో హైలెట్ అవుతుందంటున్నారు. అదే అయితే మిగతా అంతా డౌన్ అయినట్టే కదా. ఓ రకంగా చూస్తే ప్రమోషన్స్ తో ఆడియన్స్ లోకి వెళ్లిపోయింది రాబిన్ హుడ్ టీమ్. అదిదా సస్పెన్స్ అనే ఐటమ్ సాంగ్ విమర్శల పాలు కావడం వీరికి ప్రమోషనల్ గా కలిసొచ్చింది.
ఇక మ్యాడ్ ఆల్రెడీ సూపర్ హిట్ అయిన మూవీ. ఇందులో కథ వెతకొద్దు అని అదే పనిగ చెబుతోంది టీమ్. కేవలం కామెడీని ఎంజాయ్ చేయమంటున్నారు. అలా అనుకున్నా ఏదో ఒక చిన్న థ్రెడ్ కావాలి కదా. ఆ థ్రెడ్ ను కూడా సిల్లీ కామెడీలో భాగంగా కలిపేలా ఉన్నారని ట్రైలర్ చూస్తే అర్థం అయింది. వీళ్లూ విపరీతమైన ప్రమోషన్స్ చేస్తున్నారు. సితార బ్యానర్ లో సినిమా కాబట్టి ఇతర హీరోల అభిమానులు కూడా ఈ చిత్రానికి ప్లస్ అవుతారు. అలాగే థియేటర్స్ పరంగా చూసుకున్నా.. రాబిన్ హుడ్ కంటే ఈ చిత్రానికే కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఇందులోనూ రెండు ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. ఈ సారి హీరోయిన్లతో పెద్దగా పని ఉండదు అంటున్నారు. అశ్లీలత, అసభ్యత లేకపోవడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చే అంశం. దీని వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కామెడిన ఎంజాయ్ చేస్తారు.
మొత్తంగా ఈ 28 నితిన్ వర్సెస్ యంగ్ స్టర్స్ గా కనిపించబోతోంది. మరి ఈ కాంపిటీషన్ లో ఖలేజా చూపించేది ఎవరో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com