సినిమా

Sridevi: ఆ సీనియర్ హీరో కలిసిన ప్రతీసారి శ్రీదేవి పాదాలను తాకేవారట..

Sridevi: శ్రీదేవి.. ఇప్పటికీ చాలామంది ప్రేక్షకుల మనసులో తనదైన ముద్ర వేసుకున్న అతిలోక సుందరి.

Sridevi: ఆ సీనియర్ హీరో కలిసిన ప్రతీసారి శ్రీదేవి పాదాలను తాకేవారట..
X

Sridevi: శ్రీదేవి.. ఇప్పటికీ చాలామంది ప్రేక్షకుల మనసులో తనదైన ముద్ర వేసుకున్న అతిలోక సుందరి. ఆమె చేసిన సినిమాలు, తాను పోషించిన పాత్రలు, తన అభినయం.. అన్నీ ఇప్పటికీ అభిమానుల మనసులో నిలిచిపోయాయి. ఆమె తర్వాత తన వారసురాల్లుగా జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ బాలీవుడ్‌లో రాణించాలనుకుంటున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్ పలు సినిమాలతో బీ టౌన్‌లో బిజీగా గడిపేస్తోంది.

జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ కూడా త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే తాజాగా జాన్వీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడ తన తల్లి గురించి, బాబాయ్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. తనతో పాటు బాబాయ్ అనిల్ కపూర్ కూడా అవి నిజమేనంటూ అప్పటి స్మృతులను గుర్తుచేసుకున్నారు.

అనిల్ కపూర్.. కలిసిన ప్రతీసారి శ్రీదేవి పాదాలకు నమస్కరించేవారట. అంతే కాకుండా ఆమె ఎప్పటికైనా ప్రపంచ సినిమా భాషలన్నింటిలో తన ఫేవరెట్ నటి అని అనిల్ కపూర్ అన్నారు. అనిల్ కపూర్, శ్రీదేవి కలిసి పలు హిందీ సినిమాల్లో కూడా నటించారు. అయితే అనిల్ కపూర్ తన ఫేవరెట్ కో స్టార్ అని చాలాసార్లు శ్రీదేవి తనతో చెప్పిందని జాన్వీ కపూర్ తెలిపింది.

Next Story

RELATED STORIES