Miss Shetty Mr. Polishetty : ఈ సినిమాకు అనుష్క తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే..!

చాలా గ్యాప్ తర్వాత అనుష్క శెట్టి 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ద్వారా మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. దీంతో తెలుగు చిత్రసీమలో చాలా మంది ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా ఈ మూవీ చేరిపోయింది. సెప్టెంబర్ 7న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన నవీన్ పోలిశెట్టి, అనుష్క ల ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పోస్టర్ లో అనుష్క చేతిలో పుస్తకంతో కనిపించగా. .దానిపై హ్యాపీ సింగిల్ అని రాసింది. ఇక పక్కనే ఉన్న నవీన్ పోలిశెట్టి 'రెడీ టు మింగిల్' అని రాసి ఉన్న టీ-షర్ట్ ధరించి కనిపించాడు. పోస్టర్‌ని బట్టి చూస్తే, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రొమాంటిక్ కామెడీగా రానుందని తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు మహేష్ బాబు పి. దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక తాజా సమాచారం ప్రకారం.. అనుష్క టాప్ స్టార్ హీరోయిన్స్ లలో ఒకరన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆమె చిత్రాలకు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయడం కామనే. ఈ విషయానికొస్తే ఆమె ఈ సినిమా కోసం తన రెమ్యునరేషన్‌గా ఆరు కోట్ల రూపాయలను తీసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఈ టాక్ అయితే సోషల్ మీడియాలోనూ నడుస్తోంది.
ఇక నవీన్ పొలిశెట్టి కూడా అప్పట్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన జాతి రత్నాలుతో తన రెమ్యునరేషన్ ను కూడా పెంచినట్టు తెలుస్తోంది. సూపర్‌హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న ఈ నటుడు.. తనలో ఏమాత్రం స్పీడ్ తగ్గడం లేదని నిరూపించుకున్నాడు. ఇదిలా ఉండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఈ సెన్సిబుల్ రొమాంటిక్ డ్రామాలో అనుష్క ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో చూడాలని ఆమె అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. నవీన్‌తో ఆమె కెమిస్ట్రీ కూడా యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నందున ఈ మూవీ కోసం వారు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com