Actress Hema : ఇది నా లైఫ్..ఎక్కడికైనా వెళ్తా.. : హేమ

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో టాలీవుడ్ సినీ నటి హేమ పాల్గొన్నారనే వార్త ఇప్పటికీ సంచలనమే. ఈ ఏడాది మే 19, 20 తేదీల్లో ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ఎండీఎంఏ, కొకైన్ వంటి డ్రగ్స్ వాడినట్టు పోలీసులు గుర్తించారు. హేమకు వైద్య పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. హేమ జైలుకు కూడా వెళ్లారు. షరతులతో కూడిన బెయిల్ పై విడుదలయ్యారు.
ఓ ఇంటర్వ్యూలో హేమ దీనిపై స్పందించారు. తాను తప్పు చేయలేదని కోర్టే చెపుతుందని... అయితే, కోర్టు వ్యవహారాలు తొందరగా తేలవని హేమ చెప్పారు. తన సభ్యత్వాన్ని 'మా' రద్దు చేయడంపై కూడా ఆమె అసహనం వ్యక్తం చేశారు. తాను బెంగళూరు పార్టీకి హాజరైన మాట నిజమేనని చెప్పారు. బర్త్ డే పార్టీ జరుపుకుంటున్న వ్యక్తి తన బ్రదర్ లాంటి వాడని... అందుకే ఆయన పిలిస్తే వెళ్లానని తెలిపారు.
తాను శనివారం జరిగిన పార్టీకి వెళ్లానని, ఆదివారం ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు. తాను ఇంకా బ్లడ్ శాంపిల్స్ కూడా ఇవ్వలేదని... కానీ టెస్టుల్లో తనకు పాజిటివ్ వచ్చిందంటూ ఓ మీడియా ఛానల్ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు. తాను ఎక్కడికైనా వెళ్తానని, తన జీవితం తన ఇష్టమని... తనను ప్రశ్నించే హక్కు మీకెక్కడిదని హేమ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com