Renu Desai: ఇది సమయం కాదు.. తర్వాత చెప్తా: రేణూ దేశాయ్

Renu Desai: సరదాగా కాదు ఆమె సీరియస్‌గా చాట్ చేస్తున్నారు. రోజుకు 16 గంటలు ఫోన్ మాట్లాడుతూనో, చాట్ చేస్తూనో కరోనా బాధితులకు సేవ చేస్తున్నారు. అవసరమైన వారికి ఆర్థిక సాయమో, మాటసాయమో.. అంత బిజీలోనూ ఏమాత్రం విసుగు పడకుండా అభిమానులకు ఆన్సర్ ఇస్తుంటారు రేణూ దేశాయ్. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటారు. తన కూతురు ఆధ్య, కొడుకు అకీరాలకు సంబంధించిన ఫోటోలను నెట్‌లో షేర్ చేస్తుంటారు.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోయాయి. దీంతో ఇంటికే పరిమితమైన రేణూ తన అవసరం కోరి వచ్చిన వారికి చేతనైనంత సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు అకీరా ఎంట్రీ గురించి పదే పదే అడుగుతున్నారు. అయితే ఇది అకీరా ఎంట్రీ గురించి చర్చించే సమయం కాదు. కోవిడ్ గురించి అందరూ భయపడుతున్న పరిస్థితుల్లో తానేమీ చెప్పలేనని, కానీ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానని రేణూ అన్నారు.
దీంతో త్వరలోనే అకీరా ఎంట్రీ ఉంటుందని అంతా భావిస్తున్నారు. మరోవైపు రేణూ అకీరాతో దిగిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఈ ప్రపంచంలో నన్ను చెప్పలేనంత ఆనందంలో ముంచెత్తగల ఒకే ఒక్కడు అకీరా.. అతని జోకులు వింటుంటే నా జోకులే నన్ను నవ్విస్తున్నట్లు ఉంటుంది అని రేణు చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com