Rahul Sipligunj: గల్లీ సింగర్ టు బిగ్ బాస్ విన్నర్.. రాహుల్ సిప్లిగంజ్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే..

Rahul Sipligunj (tv5news.in)
Rahul Sipligunj: తెలుగులో ప్రైవేట్ సాంగ్స్‌కు అంతగా పాపులారిటీ ఉండదు. మ్యూజిక్ లవర్స్ దాదాపు సినిమా పాటలనే వింటూ.. వాటినే ఎంజాయ్ చేస్తారు. బాలీవుడ్, హాలీవుడ్‌లాగా ఇక్కడి ప్రేక్షకులకు ప్రైవేట్ సాంగ్స్ వినే అలవాటు చాలా తక్కువ. అందుకే సింగర్స్ కూడా ఎక్కువగా ప్రైవేట్ సాంగ్స్‌పై ఆసక్తి చూపించరు. కానీ ఇలాంటి ప్రైవేట్ సాంగ్స్‌ను ఎక్కువగా ప్రేక్షకులకు అలవాటు చేసిన సింగర్స్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు రాహుల్ సిప్లిగంజ్.
రాహుల్ సిప్లిగంజ్ సింగర్‌గా తన కెరీర్‌ను 2009లోనే ప్రారంభించాడు. కెరీర్ మొదట్లోనే ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లాంటి హీరోల సినిమాల్లో పాటలు పాడి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. మాస్ సాంగ్స్ పాడాలంటే రాహుల్ వాయిస్ పర్ఫెక్ట్ అని అనుకునే సంగీత దర్శకులు కూడా లేకపోలేదు. అలా మాస్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు రాహుల్.
సినిమా పాటలతో సింగర్‌గా గుర్తింపు వచ్చిన తర్వాత కూడా.. రాహుల్ సిప్లిగంజ్‌కు అంతగా ఆఫర్లు రాలేదు. అలాంటి సమయంలోనే తానే సొంతంగా ప్రైవేట్ సాంగ్స్ చేయడం మొదలుపెట్టాడు. మెల్లగా రాహుల్ చేసే ప్రైవేట్ సాంగ్స్‌కు విపరీతంగా పెరిగిపోయింది. దీంతో మరోసారి తను మ్యూజిక్ డైరెక్టర్స్ దృష్టిలో కూడా పడ్డాడు. మరోసారి టాలీవుడ్‌లో బిజీ సింగర్ అయిపోయాడు.
అటు ప్రైవేట్ సాంగ్స్‌తో.. ఇటు సినిమాల్లో సింగర్‌గా అలరిస్తున్న సమయంలోనే రాహుల్ సిప్లిగంజ్‌కు బిగ్ బాస్ రియాలిటీ షో నుండి ఆఫర్ వచ్చింది. అలా బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా కనిపించాడు రాహుల్. పక్కింటి కుర్రాడిగా, హైదరాబాదీ అబ్బాయిగా రాహుల్ మాటలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేవి. అందుకే తన అభిమానులంతా తనను బిగ్ బాస్ విన్నర్‌గా నిలబెట్టారు. చివరిగా రాహుల్ 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో పాడిన నాటు నాటు పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com