Faria Abdullah : నేను వర్క్‌ చేసిన టీమ్‌లలో ఇది బెస్ట్ : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah : నేను వర్క్‌ చేసిన టీమ్‌లలో ఇది బెస్ట్ : ఫరియా అబ్దుల్లా
X

‘జాతి రత్నాలు’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ఆ మూవీలో చిట్టి క్యారెక్టర్ తో ఆడియెన్స్​ కు నవ్వులు పంచింది. ఆ తర్వాత ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కట్టినా ఏ సినిమా ‘జాతిరత్నాలు’లాగా సక్సెస్ కాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగార్రాజు, లైక్.. షేర్.. సబ్ స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటీ అడక్కు సినిమాల్లో ఫరియా నటించింది. ఇటీవల ‘కల్కి’ సినిమాలోనూ ఓ సాంగ్ లో మెరిసింది. ఆమె యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలరా2’. ఐదేళ్ల కిందట వచ్చిన డార్క్ కామెడీ థ్రిల్లర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫరియా ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ‘నేను వర్క్‌ చేసిన టీమ్‌లలో ఇది బెస్ట్. షూటింగ్ చాలా సరదాగా జరిగింది. ఈ సినిమా కోసం నేను ఓ పాట రాశాను. దాన్ని నేనే పాడి కొరియోగ్రఫీ చేశా. కొత్తగా ఉంటుంది. ఎంజాయ్‌ చేస్తారు’అని ఫరియా అబ్దుల్లా చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో ‘నిధి’ అనే క్యారెక్టర్ లో ఫరియా కనిపించనుంది. ఆమెకు యాక్షన్ సీక్వెన్స్​ లు ఎక్కువగా ఉన్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.

Tags

Next Story