NBK 107: మాస్ లుక్‌లో బాలయ్య.. ఎన్‌బీకే 107కు పర్ఫెక్ట్ టైటిల్ ఫిక్స్..

NBK 107: ప్రస్తుతం టాలీవుడ్‌లోని సీనియర్ హీరోలు అందరూ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. అంతే కాకుండా బ్యాక్ టు బ్యాక్ హిట్లు కూడా కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలా మంచి ఫామ్‌లో ఉన్న సీనియర్ హీరోల్లో ఒకరు బాలకృష్ణ. ప్రస్తుతం బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక తాజాగా తన తరువాతి సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యిందని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
బాలకృష్ణ చివరిగా నటించిన చిత్రం 'అఖండ'. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను కొట్టింది. అఖండ రిలీజ్ ఓ సెన్సేషన్‌గా మారింది. దీంతో బాలయ్య తరువాతి సినిమాలపై నందమూరి అభిమానులు అంచనాలు పెంచేసుకున్నారు. అయితే తన తరువాతి సినిమా బాధ్యతలు గోపీచంద్ మలినేనిలాంటి యంగ్ డైరెక్టర్ చేతిలో పెట్టాడు బాలయ్య. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది.
ఇప్పటికే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ ప్రారంభమయినప్పుడు ఇందులో నుండి హీరో ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. ఇందులో బాలయ్య మాస్ లుక్‌లో అదిరిపోయాడు. ఇప్పుడు ఈ మూవీకి 'అన్నగారు' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇంతకు ముందు కూడా ఒకసారి ఈ టైటిల్ తెరపైకి వచ్చింది. ఇక తాజాగా ఇదే టైటిల్ ఫిక్స్ అన్న రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com