Vijay Devarakonda Kingdom : ఇది విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న సినిమా టైటిల్ ‘కింగ్ డమ్’అని పెట్టారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ఇది. చెప్పినట్టుగానే ఇన్ టైమ్ లోనే టైటిల్ టీజర్ విడుదల చేశారు. ఈ టైటిల్ టీజర్ కు తెలుగులో ఎన్టీఆర్, తమిళ్ లో సూర్య, హిందీలో రణ్ బీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించారు. మిగతా భాషలేమో కానీ తెలుగులో ఎన్టీఆర్ వాయిస్ ఈ టీజర్ కు హైలెట్ అయింది. అలాగే అనిరుధ్ నేపథ్య సంగీతం నెక్ట్స్ లెవల్ లో కనిపిస్తోంది. ఓ హాలీవుడ్ సినిమా రేంజ్ లో మేకింగ్, టేకింగ్ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ కాస్త సెన్సిబుల్ మూవీస్ తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ సారి బ్లడ్ షెడ్ లాంటి మూవీతో వస్తున్నాడని ఈ టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఇక విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ సారి కాలర్ ఎత్తుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ రేంజ్ లో ఉంది టీజర్. మామూలుగా ఇలాంటి టీజర్స్ చూసిన వెంటనే అంచనాకు రావడం కనిపిస్తుంది. అయితే వీళ్లు టీజర్ తోనే బ్లాక్ బస్టర్ లుక్ తో కనిపిస్తున్నారు. ఇది అరుదుగా జరుగుతుంది. అందుకే ఇది కింగ్ డమ్ నామ సంవత్సరం అయినా ఆశ్చర్యం లేదు అనేలా ఉంది. టీజర్ లో ఎన్టీఆర్ వాయిస్ గూస్ బంప్స్ అనేలా ఉంది. అందుకోసం రాసిన డైలాగ్స్ సైతం అదిరిపోయాయి.
‘‘అలసట లేని భీకర యుద్ధం.. అలలుగా పారే ఏరుల రక్తం.. వలసపోయినా అలిసిపోయినా ఆగిపోనిది ఈ మహారణం.. నేలపైన దండయాత్ర.. మట్టి కింద మృతదేహాలు.. ఈ అలజడి ఎవరి కోసం.. ఇంత భీబత్సం ఎవరి కోసం.. అసలీ వినాశనం ఎవరి కోసం.. రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం.. కాలచక్రాన్ని బద్ధలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం..’’ అంటూ ఎన్టీఆర్ తనకే సొంతమైన మాడ్యులేషన్ లో వాయిస్ ఓవర్ చెబుతుంటే.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయనే చెప్పాలి.
ఇక ఇప్పటి వరకూ ఈ మూవీ అలా ఉంటుంది.. ఇలా ఉంటుంది.. విజయ్ పాత్ర ఇదీ అంటూ వచ్చిన అన్ని లెక్కలను తారుమారు చేసేలా ఉంది టీజర్. టీజర్ లో విజయ్ ఎంట్రీ, అతని స్క్రీన్ ప్రెజెన్స్.. చివర్లో ‘‘ఏవైనా చేస్త సార్.. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్త సార్’’ అని అతను చెప్పిన డైలాగ్ మరో స్థాయిలో కనిపిస్తోంది. ఏదేమైనా టాలీవుడ్ కింగ్ డమ్ విజయ్ దేవరకొండ ఈ సారి సంచలనం సృష్టించబోతున్నాడనే చెప్పాలి. సినిమాను మే ౩౦న విడుదల చేయబోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com