Game Changer : ఈ సంక్రాంతి కాస్త డిఫరెంట్

టాలీవుడ్ లో సంక్రాంతి అంటే స్టార్ హీరోల సినిమాలే కాదు.. బాక్సాఫీస్ వద్ద స్టార్ వార్స్ కూడా చూస్తుంటాం. ఏ హీరో ఎంత ఎక్కువ కలెక్ట్ చేశాడు. ఏ హీరోల మధ్య పోటీ ఉంది అనే పోలికలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. బట్ ఈ సారి సంక్రాంతి అందుకు భిన్నంగా కాస్త విలక్షణంగా కనిపిస్తోంది. మూడు సినిమాలు విడుదలువుతున్నాయి. ఈ మూడూ దేనికవే డిఫరెంట బ్యాక్ డ్రాప్స్ తో వస్తున్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్యాన్ ఇండియా మూవీగా వస్తోంటే.. బాలకృష్ణ డాకూ మహరాజ్ ఫియర్ లెస్ యాక్షన్ ఎంటర్టైనర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం.. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్.
ఈ ముగ్గురు హీరోల రేంజ్ ను బట్టి చూసినా పోటీ అనే మాటే కనిపించదు. రామ్ చరణ్ ఆల్రెడీ ప్యాన్ ఇండియా స్టార్. ఆ మేరకే ఆసినిమా రేంజ్ కనిపిస్తోంది. పైగా దర్శకుడు శంకర్ కాబట్టి ఈ మూవీ స్పాన్ నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని వేరే చెప్పాల్సిన పనిలేదు. జనవరి 10న గేమ్ ఛేంజర్ విడుదల కాబోతోంది. చరణ్ కెరీర్ లో హయ్యొస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకోబోతోన్న సినిమాగా ఇప్పటికే అంచనాలున్నాయి. ఆ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అనేదే అసలు టాస్క్.
జనవరి 12న డాకూ మహరాజ్ విడుదల కాబోతోంది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అంతకు మించి ఎక్స్ పెక్ట్ చేసినా రీచ్ అవుతాం అని ఫ్యాన్స్ ను ఊరిస్తున్నాడు దర్శకుడు. బాలయ్య ఇంతకు ముందెప్పుడూ లేనంత అగ్రెసివ్ గా ఈ చిత్రంలో ఉంటాడు అంటున్నారు. టీజర్ మైండ్ బ్లోయింగ్ అనిపించుకుంటే.. రెండు పాటలకూ మిక్స్ డ్ ఒపీనియన్స్ వచ్చాయి. బట్ ఊర్వశి రౌతేలా సాంగ్ మాస్ ను ఊపేస్తుందంటున్నారు. ట్రైలర్ కూడా వచ్చేస్తే డాకూ మహరాజ్ అంచనాలు స్టార్ట్ అవుతాయి.
కమర్షియల్ హిట్ కాంబినేషన్ గా వెంకటేష్, అనిల్ రావిపూడి రూపొందించిన సంక్రాంతికి వస్తున్నాం కంప్లీట్ గా డిఫరెంట్ మూవీ. కమర్షియల్ ఎంటర్టైనర్. పండగ టైమ్ లో ఆడియన్స్ సరదాగా వెళ్లి చూసేలా ఉంటూనే అనిల్ మార్క్ కామెడీ, యాక్షన్ కూడా మిక్స్ అవడం.. అలాగే వెంకీ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండటం ఈ మూవీకి కలిసొచ్చే అంశాలంటున్నారు. ఇప్పటికైతే ఆడియన్స్ లో ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న మూవీగా సంక్రాంతికి వస్తున్నాంనే చెబుతున్నారు విశ్లేషకులు.
విశేషం ఏంటంటే.. ఈ మూడు సినిమాల్లో గేమ్ ఛేంజర్ కు డాకూ పోటీ కాదు. డాకూకు సంక్రాంతికి వస్తున్నాం పోటీ కాదు. మూడూ డిఫరెంట్ జానర్స్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయబోతున్నాయి. సో.. ఇక్కడ డామినేషన్ అనేది కేవలం బాక్సాఫీస్ వద్దే కానీ.. రేంజ్ లలో ఉండదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com