Balakrishna Unstoppable : ఈ సారి బాలయ్య షోలో అదిరిపోయే గెస్ట్ లు

Balakrishna Unstoppable :  ఈ సారి బాలయ్య షోలో అదిరిపోయే గెస్ట్ లు
X

నందమూరి బాలకృష్ణకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇతర హీరోలకు ఉండదు. అలాగే అతనికి ఇతర హీరోల ఫ్యాన్స్ ను కూడా అభిమనులను చేసిన షో అన్ స్టాపబుల్. ఆహా ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అయిన ఈ రియాలిటీ షోతో బాలయ్య మరింత ఎక్కువమందికి దగ్గరయ్యాడు. తన టైమింగ్, ఇంటర్వ్యూ చేసే విధానం సూపర్బ్ అనిపించుకుంది. ఆయన ఒరిజినల్ నేచర్ ఏంటనేది అందరికీ తెలిసింది ఈ షో తోనే. అందుకే ఈ షో కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటి వరకూ రెండు సీజన్స్ పూర్తయ్యాయి. త్వరలోనే అంటే దసరా నుంచి థర్డ్ సీజన్ స్టార్ట్ కాబోతోంది.

ఈ థర్డ్ సీజన్ ఫస్ట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తాడు అని ఆల్మోస్ట్ కన్ఫార్మ్. అలాగే ఎప్పటి నుంచో కాస్త వైరాలు ఉన్న నాగార్జునను కూడా రప్పిస్తున్నారని హింట్స్ వచ్చాయి. ఆయన కూడా ఒప్పుకున్నారని టాక్. వీరితో పాటు ఈ సారి షో కు మరింత స్పైస్ యాడ్ కాబోతోంది. ఆలిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ను కూడా పిలుస్తున్నారట. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అన్ స్టాపబుల్ సీజన్ లో పార్టిసిపేట్ చేస్తాడంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు వచ్చారు. అప్పుడాయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి కాబట్టి, గతంలో ఈయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాడు కాబట్టి.. షోలో ఈ ఎపిసోడ్ మరింత రక్తి కట్టే అవకాశం ఉంది.

ఇక తన ఇంటి మనుషులే అయిన బాలయ్య కూతుళ్లు, అల్లుళ్లు కలిసి కూడా ఒక షో ఉంటుందని సమాచారం. మొత్తంగా బాలయ్య కోసం ఈ థర్డ్ సీజన్ కు భలే గెస్ట్ లను సెట్ చేస్తున్నారు. అయితే ఏమాటకామాట.. సెకండ్ సీజన్ గెస్ట్ ల విషయంలో ఆహా కొంత డిజప్పాయింట్ చేసింది. అది కవర్ చేయడానికే ఈ సారి మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టున్నారు.

Tags

Next Story