Manasantha Nuvve Re Release : ఈ వాలెంటైన్స్ డేకి మళ్లీ మనసంతా నువ్వే

Manasantha Nuvve Re Release :  ఈ వాలెంటైన్స్ డేకి మళ్లీ మనసంతా నువ్వే
X

మనసంతా నువ్వే.. ఓ క్లాసిక్ లవ్ స్టోరీ మూవీగా పేరు దక్కించుకుంది. కమర్షియల్ గానూ చాలా పెద్ద విజయం సాధించింది. ఈ మూవీతో హీరో ఉదయ్ కిరణ్ హ్యాట్రిక్ పూర్తి చేశాడు. అంతకు ముందు చిత్రం, నువ్వు నేను మూవీస్ తో చాలా పెద్ద విజయాలు అందుకున్నాడు. ఆ రెండు సినిమాలకు మించి ఈ మూవీ చాలా చాలా పెద్ద విజయం అందుకుంది. అందుకే ఈ మూవీ ఎప్పుడు టివిల్లో చూసినా ఆడియన్స్ ఇప్పటికీ చూస్తూనే ఉంటారు. టివి రిమోట్ ను కూడా పక్కన పెట్టరు. అయితే ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కు అలాంటి విజయాలు రాలేదు. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. 2014 జనవరి 5న ఆయన ఇంట్లోనే ఉరి పెట్టుకున్నాడు. అయితే అతని మరణం చాలామంది జీర్ణించుకోలేకపోయారు.

2001 అక్టోబర్ ౧౯న విడుదలైన మనసంతా నువ్వే మూవీకి నాటి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. విఎన్ ఆదిత్య దర్శకత్వం, ఎమ్ఎస్ రాజు నిర్మాణం సినిమాకు హైలెట్ గా నిలిచాయి. చైల్డ్ సెంటిమెంట్ తో మొదలైన ప్రేమ.. తర్వాత అతను అనాథగా మారిపోవడం.. ఆపై చంద్రమోహన్, సుధ దంపతులు అతన్ని సొంతకొడుకులా పెంచడం.. అతని చిన్ననాటి అమ్మాయితో పెద్దవాడయ్యాక కూడా ప్రేమించడం.. చివరికి ఆమె అతనికి కలవడం.. ఆమె ఎవరో అతనికి చెప్పకపోవడం.. ఈ క్రమంలో వచ్చే అద్భుతమైన సన్నివేశాలు, పాటలు.. ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి. ఉదయ్ కిరణ్ కు జోడీగా నటించిన రీమా సేన్ ను ఎవరూ మర్చిపోలేరు. అలాగే తనూరాయ్ నటనా ఆకట్టుకుంటుంది. తనికెళ్ల భరణి, చంద్ర మోహన్, సుధ, సునిల్, షిజు, పావలా శ్యామలా.. ఇలా ఎవరికి వారే అద్భుతమైన నటనతో మెప్పించారు.

ఇలాంటి మూవీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుందో కానీ.. అప్పుడు వచ్చినా.. ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ గా మిగిలిపోయింది. మరి ఇలాంటి మూవీని మళ్లీ విడుదల చేయడం ఖచ్చితంగా నాటి ఆడియన్స్ లో ఎన్నో మెమరీస్ ను కదిలిస్తుంది. నేటి ప్రేక్షకులకూ నేడూ ఆనాటి ఫీలింగ్ ఇస్తుందేమో. మొత్తంగా ఈ మూవీని ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ మూవీ ఇప్పుడు ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Tags

Next Story