Telugu Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు..
ప్రముఖ నృత్య దర్శకురాలు బృందా దర్శకత్వంలో వస్తున్న చిత్రం హే సినామిక.. ఈ చిత్రంలో దుల్కర్ సల్లమాన్, కాజల్ నాయకా నాయికలుగా నటించారు.. మార్చి3న ధియేటర్లలో సందడి చేయనుంది. ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ కలిసి ఉండాలంటే ఒకే ఒక్క కారణం చాలు.. అదే ప్రేమ.. ఇదే కాన్సెఫ్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకురాలు.
టైటిల్‌కు తగ్గట్టుగానే మహిళలకు ప్రాధాన్యం ఉన్న చిత్రం శర్వానంద్, రాధిక, కుష్బూ, ఊర్వశి, రశ్మిక మందన నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ చిత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.
వచ్చిన రెండు సినిమాలతోనే మంచి నటుడిగా ముద్ర వేసుకున్న కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం సెబాస్టియన్ పీసీ 524.. ఈ సినిమా కూడా మార్చి 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రేచీకటితో బాధపడే కానిస్టేబుల్ కథ ఇది. ఆ కానిస్టేబుల్ నైట్ డ్యూటీ ఎలా చేస్తాడు.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు.. అనే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కిరణ్ సరసన కోమలి ప్రసాద్, నువేక్ష నటించారు.
సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం మార్చిన 4నుంచి ఓటీటీలో సందడి చేయనుంది.
విశాల్, డింపుల్ హయాతీ నటించిన చిత్రం సామాన్యుడు చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. మార్చి 4నుంచి జీ5 వేదికగా స్ట్రీమ్ అవనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com