Chhaava collections : ఛావా మూడు రోజుల కలెక్షన్స్ ఎంత

Chhaava collections :  ఛావా మూడు రోజుల కలెక్షన్స్ ఎంత
X

హిస్టారికల్ ఫిక్షన్ మూవీస్ ఇప్పుడు ఒరిజినల్ మూవీస్ లాగానూ.. సినిమాలే చరిత్రగానూ కనిపిస్తున్నాయి. ఆ కోవలో వచ్చిన మరో సినిమా ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ కథగా వచ్చిన ఈచిత్రం హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విక్కీ కౌశల్ శంభాజీగా, రష్మిక మందన్నా ఆయన భార్య యషూబాయి పాత్రలో నటించారు. మరాఠా సామ్రాజ్యాన్ని కొల్లగొట్టాలని ప్రయత్నించిన ఔరంగజేబ్ ఆ ప్రయత్నంలో శివాజీని ఎదుర్కోవడం.. తర్వాత ఆయన తనయుడు శంభాజీ ఔరంగజేబ్ ను ఎదురిస్తూ.. అతనికి దొరికిపోయి చిత్ర హింసలు అనుభవించి మరణించే కథ ఇది. ఎమోషనల్ గా ఎంతోమందిని కదిలించింది. ఈ మూవీని తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేశాడు.

ఈ నెల 7న విడుదలైన ఛావాకు తెలుగు నుంచీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓపెనింగ్ డే దాదాపు మూడు కోట్లు వసూళ్లు వచ్చాయి. వీకెండ్ లో మరింత పుంజుకుని ఇక్కడా బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్నారు. అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ నే కంటిన్యూ చేస్తూ ఆదివారం వరకూ ఈ చిత్రం 9.46 కోట్ల వసూళ్లు సాధించి తెలుగులోనూ సత్తా చాటింది. ఈ ఫిగర్స్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. లక్షణ్ ఉటేకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి తెలుగులో రిలీజ్ కు ముందు ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. అయినా ఈ వసూళ్లు వచ్చాయంటే అది సినిమాకు బాలీవుడ్ నుంచి వచ్చిన రివ్యూస్ తో పాటు మౌత్ టాక్ వల్లే అనుకోవాలి.

Tags

Next Story