Bhairavam Movie : భైరవం.. ముగ్గురికీ కీలకమే

భైరవం.. ఈ నెల 30న విడుదల కాబోతోన్న సినిమా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లు హీరోలుగా నటించారు. తమిళ్ లో వచ్చిన గరుడన్ కు రీమేక్ ఇది. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేశాడు. ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించారు. ముగ్గురు హీరోలకు స్ట్రాంగ్ ఇమేజ్ ఉంటే దాన్ని బ్యాలన్స్ చేయడం అనేది దర్శకులకు ఉండే టాస్క్. ఇక్కడ ఆ సమస్య లేదు. ముగ్గురూ పెద్ద స్టార్స్ కాదు. అదీ కాక ప్రస్తుతం ఈ ముగ్గురికీ ఒక్క హిట్టు కావాలి. శ్రీనివాస్ హీరోగా నిలబడే ప్రయత్నంలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ స్ట్రాంగ్ బ్రేక్ అనదగ్గ సినిమా పడలేదింకా. మనోజ్ ఇంక హీరోగా చేస్తే చూసే ఆడియన్స్ ఉన్నారా అనేది పెద్ద ప్రశ్న. నారా రోహిత్ కథల ఎంపికలో ఒకప్పుడు బెస్ట్. కానీ చాలాకాలం క్రితమే గాడి తప్పాడు. వరుసగా డిజాస్టర్స్ చూస్తున్నాడు.
సో.. ప్రస్తుతం ఈ ముగ్గురికీ ఒక హిట్ కావాలి. అది భైరవంతో వస్తుందని నమ్ముతున్నారు. అందుకే ప్రమోషన్స్ పరంగా మంచి ఉత్సాహంగా కనిపిస్తున్నారు. తమిళ్ లో ఈ మూవీ హిట్ అయింది. కానీ అక్కడ నటించిన ముగ్గురికీ డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. సూరి ఈ మధ్యే హీరో అయ్యాడు. అంతకు ముందు కమెడియన్. ఆ పాత్రలో శ్రీనివాస్ కనిపిస్తాడు. శశికుమార్ కు క్రేజ్ ఉంది. ఆ పాత్రలో మనోజ్, మరో పాత్ర చేసిన మళయాల నటుడు ఉన్ని ముకుందన్ పాత్రగా రోహిత్ కనిపిస్తాడు. సో.. ఆ ముగ్గురితో పోలిస్తే ఈ ముగ్గురిదీ భిన్నమైన ఇమేజ్.
ఈ మధ్య వచ్చిన టీజర్ చూస్తే తెలుగులో కొన్ని మార్పులు చేసినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా శ్రీనివాస్ ను హైలెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ట్రైలర్ లో కూడా మంచి మాస్, యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేశారనే టాక్ ఉంది. పాటలు ఓకే అనిపించుకున్నాయి. హీరోయిన్లతో పాటు మదర్ పాత్రలో జయసుధ పాత్రా కీలకమే అనిపిస్తోంది. మొత్తంగా ఈ ముగ్గురికీ భైరవంతో బ్లాక్ బస్టర్ పడుతుందా అనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. భైరవం హిట్ అయితే.. ఖచ్చితంగా ఆయా పాత్రలను బట్టి రోహిత్, మనోజ్ ల ఇమేజ్ లు మారే అవకాశం ఉంది. మారితే ఆ తరహా పాత్రలతో కొత్త ప్రయాణం మొదలుపెట్టొచ్చు. ఇక ఇప్పటి వరకూ శ్రీనివాస్ మాస్ రోల్స్ చేశాడు. ఈ సారి ఊరమాస్ గా ఉంటాడేమో. మరి ఈ ఫ్లాప్ త్రయం భైరవంతో బయటపడుతుందా లేదా అనేది చూడాలి.
అన్నట్టు దర్శకుడు విజయ్ తో పాటు తెలుగులో తెరంగేట్రం చేస్తున్న శంకర్ కూతురు అదితికీ ఈ మూవీ విజయం చాలా చాలా అవసరం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com