Mahesh Babu : మహేష్ కోసం మూడంచెల భద్రత ఏర్పాట్లు

Mahesh Babu :  మహేష్ కోసం మూడంచెల భద్రత ఏర్పాట్లు
X

రాజమౌళి సినిమా అంటే ప్రపంచం అంతా ఇప్పుడు ఇటువైపు చూస్తుంది. చాలా యేళ్ల తర్వాత అభిమానులు ఎదురుచూస్తున్న కాంబినేషన్ గా మహేష్ బాబుతో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ఓపెనింగ్ నుంచి, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వరకూ అంతా సీక్రెట్ గానే మెయిన్టేన్ చేస్తున్నాడు జక్కన్న. అయితే ఆ సీక్రెట్ అంతా కేవలం హైదరాబాద్ కే పరిమితం అయింది. ప్రస్తుతం ఒడిషాలో ఓ షెడ్యూల్ చిత్రీకరణ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ కోసం వేసిన సెట్స్ లో పాటు మహేష్ బాబు, ఇతర ఆర్టిస్ట్ లు కలిసి నటిస్తున్న సీన్స్ లీక్ అయ్యాయి. ఫస్ట్ డే సెట్ లీక్ అయితే నెక్ట్స్ డే సీన్ లీక్ అయింది. దీంతో ఆ సెట్స్ లో అస్సలు భద్రతే లేదు అన్నది తేలిపోయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తీస్తున్నప్పుడు కూడా ఈ సమస్యలు వచ్చాయి. కానీ తను చాలా ఎక్కువ సీక్రెట్ అనుకుంటోన్న మహేష్ మూవీ షూటింగ్ స్పాట్ లీక్ కావడంతో షాక్ అయ్యాడు రాజమౌళి. అందుకే మూడంచెల నిర్ణయం తీసుకున్నాడు.

మామూలుగా యుద్ధ రంగాల్లోనూ, రాజకీయ నాయకులకూ భద్రత పరమైన విధానాలుంటాయి. ఆ ప్రకారంగా ఈ మూవీ సెట్స్ లో మూడంచెల భద్రత విధానాన్ని ప్రారంభించబోతున్నాడు. అంటే సెల్ ఫోన్స్ తో పాటు ఏ ఇతర కెమెరాలు లేకుండా ఆ సెట్స్ అన్నీ ఇకపై చాలా రహస్యంగా ఉండబోతున్నాయి. ఒకవేళ ఎవరైనా లీక్ చేయాలని ప్రయత్నిస్తే.. ఒక జోన్ లో కాకపోయిన మరో జోన్ లో దొరికిపోతారు. అలా మూడు జోన్స్ ఏర్పాటు చేశాడు. ఇందుకోసం ప్రత్యేమైన ఏర్పాట్లు కూడా చేయిస్తున్నాడట. మొత్తంగా సెకండ్ షెడ్యూల్ కే లీకేజ్ ప్రాబ్లమ్ రావడం రాజమౌళిని మరింత అలెర్ట్ అయ్యేలా చేసింది.

ఇక ఈ మూవీలో మహేష్ బాబుతో పాటు మళయాల స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇతర కాస్టింగ్ తో పాటు క్రూ గురించి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఏప్రిల్ లో ఈ చిత్ర వివరాలను తెలియజేస్తూ రాజమౌళి ఓ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నాడు అనే రూమర్ కూడా ఉంది.

Tags

Next Story