Bheemla Nayak: భీమ్లా నాయక్ టికెట్లను జీవో ప్రకారమే విక్రయించాలి: జగన్ సర్కార్ ఆర్డర్

Bheemla Nayak: ఏపీలో జగన్ సర్కారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మరోసారి టార్గెట్ చేసిందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననేనిపిస్తోంది. బీమ్లా నాయక్ టికెట్లను జీవో ప్రకారమే విక్రయించాలని థియేటర్ల యజమానులకు మౌఖిక ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. టికెట్ రేట్లు పెంచి విక్రయిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. గతంలో వకీల్‌సాబ్ సినిమా విడుదలకు ముందు...టికెట్ రేట్లను తగ్గిస్తూ.. వైసీపీ ప్రభుత్వం అప్పట్లో జీవో విడుదల చేసింది. టికెట్ ధరల పెంపుపై ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు రిలీజ్ చేయలేదు.
మరోసారి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసిన ఏపీ సర్కారు?
బీమ్లా నాయక్ టికెట్లను జీవో ప్రకారమే విక్రయించాలని మౌఖిక ఆదేశాలు!
టికెట్ ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు
వకీల్‌సాబ్ సినిమా విడుదలకు ముందు టికెట్ రేట్లను తగ్గుస్తూ జీవో విడుదల చేసిన జగన్ సర్కారు
టికెట్ ధరల పెంపుపై ఇప్పటివరకు ఉత్తర్వులు విడుదల చేయని ప్రభుత్వం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com