Tiger 3 : 'బ్రహ్మాస్త్ర'ను బీట్ చేసిన సల్మాన్ మూవీ

Tiger 3 : బ్రహ్మాస్త్రను బీట్ చేసిన సల్మాన్ మూవీ
మరో కొత్త రికార్డ్ బ్రేక్ చేసిన 'టైగర్ 3'.. బ్రహ్మాస్త్ర: శివ పార్ట్ వన్ చిత్రాన్ని బీట్ చేసిన బాలీవుడ్ మూవీ

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' నవంబర్ 12న దీపావళి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజుల్లోనే భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లోనే దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లను దాటేసింది. అయితే రెండో వారం వచ్చేసరికి 'టైగర్ 3' బిజినెస్ మందగించింది. అయితే, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుండి అనేక రికార్డులను బద్దలు కొట్టింది. దేశీయ బాక్సాఫీస్‌తో పాటు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది. కోయిమోయి నివేదిక ప్రకారం, ఇప్పుడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 450 కోట్లు వసూలు చేసింది. ఈ టైగర్ 3తో రణబీర్ కపూర్ చిత్రం 'బ్రహ్మాస్త్ర' రికార్డును బద్దలు కొట్టింది. రణబీర్ కపూర్, అలియా భట్ నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 431 కోట్ల రూపాయలు వసూలు చేసిన విషయం అందరికీ తెలిసిదే.

బ్రహ్మాస్త్రను బీట్ చేసిన 'టైగర్ 3'

'బ్రహ్మాస్త్ర: శివ పార్ట్ వన్' చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. 2022 సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్, నాగార్జున వంటి అనేక ఇతర నటులతో పాటు రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలు పోషించారు. దేశీయ బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాస్త్ర జీవితకాల కలెక్షన్ 249.57 కోట్లు. 'టైగర్ 3' కూడా 16 రోజుల్లో 273.8 కోట్ల రూపాయల బిజినెస్ చేసి దేశీయ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాన్ని ఓడించింది.

'టైగర్ 3' తారాగణం

యష్ రాజ్ యూనివర్స్ బ్యానర్‌పై రూపొందిన 'టైగర్ 3' మనీష్ శర్మ దర్శకత్వం వహించిన స్పై థ్రిల్లర్. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్‌తో పాటు కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలో నటించింది. ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్‌గా నటించారు. వీరే కాకుండా, ఈ చిత్రంలో షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ యొక్క యాక్షన్ క్యామియో ఉంది. OTT నటుడు రిద్ధి డోగ్రాకు కూడా ఈ చిత్రంలో 3 నిమిషాల సన్నివేశం ఉంది.


Tags

Read MoreRead Less
Next Story