TikTok Durga rao : ఈ సారి తగ్గేదేలే... టిక్‌టాక్ దుర్గారావ్‌కు బంపరాఫర్.. !

TikTok Durga rao : సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచి సెలబ్రిటీ అయినవాళ్ళు చాలానే మంది ఉన్నారు... ఆ కోవాలోకే వస్తాడు ఈ టిక్‌టాక్ దుర్గారావ్ కూడా.. టిక్‌టాక్ యాప్‌తో ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయ్యాడు దుర్గారావ్. వెరైటీ వీడియోలు చేస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు దుర్గారావ్ అంటే ఓ సెలబ్రిటీ.. జబర్దస్త్, ఢీ లాంటి షోలలో మెరుస్తున్నాడు కూడా.. అయితే ఇప్పుడు దుర్గారావుకి బంపరాఫర్ తగిలింది.
తెలుగులో బిగ్‌బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్స్‌ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సారి ఓటీటీ వేదికగా అలరించనుంది. దీనికి కూడా టాలీవుడ్ కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. మరో రెండు నెలల్లో బిగ్‌బాస్ కొత్త సీజన్ ప్రారంభంకానుంది.
అయితే ఈ షో ఎలా ఉండబోతుంది. ఇందులో ఎంతమంది కంటెస్టెంట్స్ ఉంటారన్న చర్చ నడుస్తోంది.. ప్రతి సీజన్‌లో లాగే ఈ సారి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ ఓ లిస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో దుర్గారావ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వాస్తవానికి దుర్గారావుకి బిగ్‌బాస్ ఆఫర్ సీజన్ 5లోనే ఛాన్స్ వచ్చిందని అనుకున్నారంతా. కానీ అప్పుడు మిస్ అయిన ఛాన్స్ ఇప్పుడు వచ్చినట్టుగా తెలుస్తోంది.
దుర్గారావుతో పాటుగా 'ఢీ-10' విజేత రాజు, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, 'సాఫ్ట్‌వేర్ డెవలపర్స్'వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాకర్ ప్రత్యూష పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఓటీటీ బిగ్‌బాస్ షో ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షోని యాంకర్ ఓంకార్ సంస్థ అయిన 'ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్'కి బాధ్యతలు తీసుకోనుందని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com