Siddu : టిల్లు 2 వర్సెస్ జాక్ .. ఫస్ట్ డే కలెక్షన్స్ లో తేడా చూశారా

Siddu :  టిల్లు 2 వర్సెస్ జాక్ .. ఫస్ట్ డే కలెక్షన్స్ లో తేడా చూశారా
X

సిద్దు జొన్నలగడ్డ మూవీ అంటే ఓ రేంజ్ క్రేజ్ వచ్చేసింది అనుకున్నారు. అందుకు కారణం డిజే టిల్లు, డిజే టిల్లు స్క్వేర్. ఈ రెండూ బ్లాక్ బస్టర్ కావడంతో మనోడు కూడా టైర్ 2 హీరోల లిస్ట్ లోకి వెళతాడు ఇంక అనుకున్నారు. బట్ ఇప్పుడప్పుడే అలాంటిదేం లేదు అని జాక్ డిక్లేర్ చేసిందా అంటే అవుననే అంటున్నారు చాలామంది. నిజానికి బ్యాక్ టు బ్యాక్ మంచి కామెడీతో హిట్ కొట్టిన హీరోల సినిమాలకు మంచి ఓపెనింగ్స్ రావాలి. జాక్ కూ అలాగే వస్తాయనుకున్నారు. కానీ రాలేదు. సరికదా.. డిజే టిల్లు తర్వాత ఆ మూవీకి వచ్చిన అప్లాజ్ తో పాటు స్పెషల్ క్రేజ్ వల్ల డిజే టిల్లు స్క్వేర్ కు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అంటే ఒక హిట్ మరో బ్లాక్ బస్టర్ కు బీజం చేసింది. అంటే మరి బ్లాక్ బస్టర్ కూడా మరో భారీ ఓపెనింగ్స్ ను సెట్ చేయాలి కదా అనేది లాజిక్. ఈ లాజిక్ తో పనేం లేదు అన్నట్టుగా కనిపించింది జాక్ మూవీ.

వైష్ణవి చైతన్య హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన జాక్ మూవీకి కావాల్సినంత ప్రమోషన్స్ చేశారు. మెయిన్ టీమ్ అంతా ప్రమోషన్స్ లో ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన గెస్ట్ లు సైతం ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావాలని ఆకాంక్షించారు. బట్ కంటెంట్ ఇంపార్టెంట్ కదా. అది లేకపోవడంతో ఫస్ట్ షోకే ఈ మూవీకి ఆడియన్స్ నుంచి రిజెక్షన్ వచ్చింది. దానికి ముందు అసలు మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇది ఎక్కువమందిని ఆశ్చర్యపరిచింది.

ఇక డిజే టిల్లుకు ముందు సిద్ధుపై పెద్దగా అంచనాలు లేవు. ఈ మూవీ అనూహ్యమైన విజయం సాధించింది. అందుకే డిజే టిల్లు స్క్వేర్ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ కారణంగా ఈ సెకండ్ పార్ట్ ఏకంగా మొదటి రోజే 24 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ ను కూడా ఆశ్చర్యపరిచింది. అలా ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయింది డిజే టిల్లు స్క్వేర్.

జాక్ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా..? 3.5 కోట్లు. యస్.. మూడున్నర కోట్లు. ఎంత వ్యత్యాసం కనిపిస్తోంది కదా. పైగా ఈ వీకెండ్ తో పాటు సోమవారం కూడా పబ్లిక్ హాలిడే వచ్చింది. ఈ మొత్తాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటే మొదటి రోజే తేలిపోయాడు జాక్. ఏదేమైనా ఇది కాస్త విచిత్రమైన పరిస్థితే అని చెప్పాలి.

Tags

Next Story