Tillu Square : యూట్యూబ్ ను షేక్ చేస్తోన్న 'టికెటే కొనకుండా..'

సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించి, బ్లాక్ బస్టర్ అయిన ఎంటర్‌టైనర్ 'డీజే టిల్లు'కు సీక్వెల్ గా రాబోతున్న 'టిల్లు స్క్వేర్' పై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాలో సిద్దూకి జోడీగా అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. గత కొన్ని రోజుల క్రితం రిలీజైన ఈ సినిమాలోని 'టికెట్టే కొనకుండా..' అనే లిరికల్ సాంగ్ రికార్డ్ సృష్టించింది. యూట్యూబ్ లో దూసుకుపోతోంది. కాగా ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న 'టికెట్టే కొనకుండా..' ఇప్పుడు యూట్యూబ్ లో 15మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ ను దక్కించుకుని, తన హవాను కొనసాగిస్తోంది. మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోన్న ఈ సాంగ్.. రామ్ మిర్యాల మ్యాజికల్ వాయిస్‌తో అందర్నీ అలరిస్తోంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను స్వీయ కంపోజిషన్‌లో రామ్ మిర్యాల పాడాడు. ఈ సాంగ్ ఇప్పుడు నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారడంతో ఈ మూవీ పక్కా హిట్ అని సిద్దూ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
సిద్దు జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్ ట్యాక్సీలో రొమాంటిక్ మూడ్‌లో ఉన్న పోస్టర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రల పోషిస్తున్నారు. మొత్తానికి ఈ సారి 'టిల్లు 2'లో టైటిల్‌కు తగ్గట్టుగా డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు రొమాన్స్ కూడా అదే రేంజ్‌లో ఉండబోతున్నట్టు ఇటీవల రిలీజైన ప్రోమోతోనే అర్థమవుతోంది.
Dive into the music and let your feet tap to the beat! 🕺
— Sithara Entertainments (@SitharaEnts) August 29, 2023
Tillanna's #TicketEhKonakunda Lyrical song is on fire 🔥 with 1⃣5⃣M+ views.
🎶 https://t.co/gt4tmQ2jkk
Music & Sung by @ram_miriyala 🎹🎤
Lyrics by @LyricsShyam ✍️#TilluSquare #Siddu @anupamahere @MallikRam99… pic.twitter.com/If634ET4f5
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com