Tiragabadara Saami Teaser: ఇన్నోసెంట్ క్యారెక్టర్ లో రాజ్ తరుణ్

Tiragabadara Saami Teaser: ఇన్నోసెంట్ క్యారెక్టర్ లో రాజ్ తరుణ్
X
'తిరగబడరా సామీ' టీజర్ రిలీజ్.. పిరికివాడిగా రాజ్ తరుణ్

'ఉయ్యాల జంపాలా', 'సినిమా చూపిస్త మావా', 'కుమారి 21 ఎఫ్' చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్.. ఇప్పుడు మరో కొత్త మూవీతో రాబోతున్నాడు. 'తిరగబడరా సామీ' పేరుతో రాబోతున్న ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజైంది. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పుడు అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది. అమాయకుడైన రాజ్ తరుణ్ పాత్ర, హింసను ఇష్టపడే హీరోయిన్ పాత్రతో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత కథలో చాలా మార్పులు వస్తాయని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

1.47సెకన్ల నిడివితో రిలీజైన ఈ టీజర్.. ఈ పనినే ప్రొఫెషన్ గా ఎందుకు చూజ్ చేసుకున్నానో తెలుసుకోవచ్చా అనే డైలాగ్ లో మొదలవుతుంది. ఆ తర్వాత బాలయ్య సినిమా టికెట్స్ కోసం మర్డర్ చేసినా తప్పులేదు గిరి, ఇది నా సామ్రాజ్యం, దీన్ని అందరూ గంజాయివనం అంటున్నారని ఓ తులసి మొక్కను నాటా, ప్రాణమంటే భయపడే పిరికోడితో నీకు కాపురం ఎందుకు చెప్పు.. నువ్ వెల్లిపో అనే డైలాగ్స్ కూడా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే రాజ్ తరుణ్ క్యారెక్టర్ ఈ మూవీలో బాగానే ఎంటర్టైన్ చేస్తోందని తెలుస్తోంది.

అందమైన ప్రేమ కథలో, కామెడీ, ఎమోషన్స్, అన్నీ ఉండేలా ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. రాజ్ తరుణ్ అమాయకుడిగా చక్కగా కనిపిస్తున్నాడు. హీరోయిన్ గా చేసిన మాల్వీ మల్హోత్రా అందంగా కనిపిస్తోంది. డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి ఈ మూవీని కమర్షియల్ చిత్రంగా రూపొందించినట్టు టీజర్ ను చూస్తే తెలుస్తోంది. సురక్ష్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో మన్నారా చోప్రా కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇక జేబీ(JB) సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కెమెరా బాధ్యతలను జవహర్ రెడ్డి ఎమ్ ఎన్ నిర్వహిస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, భాష్యశ్రీ మాటలు అందిస్తున్నారు.


Tags

Next Story