Keerthi Suresh : ఇవాళే కీర్తి సురేష్ పెళ్లి

టాలెంటెడ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ పెళ్లి కబురు చెప్పి సడెన్ గా అందరికీ షాక్ ఇచ్చింది. పైగా 15యేళ్లుగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పిన మాట నిజంగానే చాలామందిని షాక్ కు గురి చేసింది. నిత్యం గాసిప్ లు వినిపించే ఇండస్ట్రీలో ఉంటూ అతని గురించి చిన్న క్లూ కూడా లేకుండా ఇన్నాళ్లూ భలే మెయిన్టేన్ చేసింది కదా అనుకున్నారు. అతని పేరు ఆంటోనీ తట్టిల్. క్రిస్టియన్. కీర్తి సురేష్ హిందూ. ఇవాళే వీరి పెళ్లి హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో గోవాలో జరగబోతోంది.
కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి ఎలాంటి హడావిడీ కనిపించడం లేదు. చాలా సన్నిహితుల సమక్షంలో సింపుల్ గానే పెళ్లి తంతును పూర్తి చేయబోతున్నారు. కీర్తి సౌత్ లోని అన్ని భాషల్లో నటించింది. మరి ఆయా ఇండస్ట్రీస్ నుంచి తనకు బాగా క్లోజ్ అనుకున్న వారినైనా పిలుస్తుందా లేక రిసెప్షన్ తో సరిపెడుతుందా అనేది తెలియదు కానీ.. ఓ టాప్ హీరోయిన్ పెళ్లి ఇంత సింపుల్ గా జరుగుతుండటం కూడా హాట్ టాపిక్ అయిపోయిందిప్పుడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com