ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా..?
ఈ ఫోటోని హీరోయిన్ గుర్తుపట్టారా? ఈ నటి రంగస్థలం మూవీలో ఐటెం సాంగ్ కూడా చేసింది. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. ఇప్పుడు గుర్తొచ్చిందా? టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే. ఒకలైన కోసం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా నిరాశపరిచింది. ముకుందా, డీజే ఇలా అన్ని వరుస ఫ్లాపులు వచ్చాయి. అయితే ఈ క్రమంలో ఎన్టీఆర్ నటిచించిన అరవింద సమేత వీరరాఘవ హిట్ కొట్టడంతో మళ్లీ ఆఫర్లు వరించాయి. గత ఏడాది నటించిన మూవీ అలవైకుంఠపురంలో.. ఇండస్ట్రీ హిట్ అందుకుంది.
అల్లు అర్జున్ సరసన నటించి పూజా హెగ్డే(Pooja Hegde) కూడా బాగా గ్లామర్ తో పాపులర్ అయింది. తాజాగా ఈమెకు చెందిన చిన్నప్పటి ఫోటో లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మె చిన్ననాటి ఫోటో వైరల్ కావడంతో ఫాన్స్ ఖుషి అవుతూ సో క్యూట్ అని కామెంట్స్ పెడుతూ షేర్ చేస్తున్నారు.
పూజా టాలీవుడ్ లో అతితక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన నటించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా స్టార్ హోదాతో రాణిస్తోంది. నటించిన మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అక్కినేని వారసుడు అఖిల్ తో ఈ మూవీలో జతకట్టింది. అలాగే ప్రభాస్ నటించిన రాధేశ్యాం మూవీలో కూడా ఈ అమ్మడు నటించడంతో ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చే మూవీలో కూడా నటించబోతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com