Tollywood : ఘనంగా హీరో శర్వానంద్ నిశ్చితార్థం
టాలివుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో శర్వానంద్ కు గురువారం నిశ్యితార్థం జరిగింది. సాప్ట్ వేర్ ఇంజినీర్ రక్షితా రెడ్డితో పెళ్లి కుదిరింది. కుటుంబ సభ్యులు, బందు మిత్రుల సమక్షంలో హైదరాబాద్ లోని ఓ హోటల్ ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసనతో కలిసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
తనకు కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాతో పంచుకున్నారు శర్వానంద్. నా జీవితంలో ఎంతో స్పెషల్ పర్సన్ అంటూ కాబోయే భార్యను పరిచయం చేశాడు. దీంతో సెలబ్రిటీలు, రాజకీయనాయకులు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శర్వా సినిమాల విషయానికి వస్తే 'ఒకే ఒక జీవితం' తర్వాత పెళ్లి పనుల్లో బిజీగా ఉండటంతో కొత్త సినిమాలను ప్రకటించలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com