Tollywood: త్రివిక్రమ్ జోనర్‌లో పౌరాణికం.. ఎన్టీఆరేనా అతడి ఛాయిస్..

Trivikram Srinivas: తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ ఒకరు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్స్ అందించాడు. అయితే త్రివిక్రమ్ ఎప్పుడూ టచ్ చేయని జానర్లలో పౌరాణిక నాటకం ఒకటి. ఇప్పుడు ఆ జోనర్‌లో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. అయితే ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడానికి జూనియర్ ఎన్టీఆర్ కంటే మంచి నటుడు ఎవరు ఉంటారు. ఆయనకు అయితేనే ఇలాంటి పాత్రలు సరిగ్గా సరిపోతాయి. తాత వారసత్వాన్ని కొనసాగించే నటుడిగా ఇప్పటికే పేరుంది ఎన్టీఆర్‌కి.
త్రివిక్రమ్ త్వరలో జూనియర్ ఎన్టీఆర్‌తో పౌరాణిక చిత్రం చేయనున్నట్టు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎన్టీఆర్‌తో హైబడ్జెట్‌తో పౌరాణిక చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. హై స్కేల్‌లో రూపొందుతుందని, పాన్ ఇండియాలో కూడా విడుదల చేస్తామని ఆయన తెలిపారు. త్రివిక్రమ్, ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్‌లు పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
రాజమౌళి తెలుగు సినిమాని పాన్-ఇండియా స్థాయికి తీసుకువెళ్లారు. ఇప్పుడు పెద్ద నిర్మాతలందరూ అదే స్థాయిలో సినిమాలు నిర్మించడానికి ఇష్టపడుతున్నారు. ఈ పౌరాణిక చిత్రం తప్పకుండా ఇతిహాసం అవుతుందని నాగవంశీ తెలిపారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర యూనిట్ వెల్లడించాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com