Tollywood : ట్రోలింగ్ చేస్తున్నారంటూ పోలీసులకు నరేష్ ఫిర్యాదు
పలు యూట్యూడ్ చానళ్లపై సీనియర్ నటుడు నరేష్ ఫైర్ అయ్యారు. తనపై పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు నరేష్. శనివారం హైదరాబాద్ లోని సైబర్ క్రైం పోలీస్టేషన్ కు వచ్చిన నరేష్.. తనపై, సినీ పరిశ్రమపై అసత్య ప్రచారాలు, ట్రోలింగ్ చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పాటు పలు యూట్యూబ్ చానళ్లకు సంబంధించిన వివరాలను పోలీసులకు సమర్పించారు.
మీడియాతో యాట్లాడిన నరేష్, ట్రోలింగ్స్ పై కోర్టులో కేసు వేసినట్లు చెప్పారు. తనపై కొన్ని యూట్యూబ్ చానళ్లు పనిగట్టుకుని విషప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. సదరు చానల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ ఏసీపీ ఫిర్యాదు చేశామని నరేష్ స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ, మీడియా కలిసి పని చేయాలని అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com