Tollywood : రామ్ చరణ్ పెంపుడు శునకం స్టైలే వేరు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెంపుడు శునకంతో రిలాక్స్ అవుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం సందర్భంగా చెర్రి డాగ్ అయిన ర్యామ్ చూపరులను ఆకట్టుకుంటోంది. ర్యామ్ కు సొంతంగా ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ఉన్నట్లు తెలిసింది. అందులో 50వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ర్యామ్ తో రామ్ చరణ్ ఉపాసన కలిసి దిగిన ఫొటోలను మెగా అభిమానులతో పాటు పలువులు ఆసక్తిగా పంచుకుంటున్నారు. ర్యామ్ హైదరాబాద్ లోనే కాకుండా రామ్ చరణ్, ఉసాసన ఎక్కడికి వెళ్లినా అక్కడ ఉండాల్సిందేనట. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ సాధించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ తో పాటు తిరిగేసింది ఈ శునకం. జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం సందర్భంగా ర్యామ్ హాట్ టాపిక్ గా మారింది.

Next Story