Tollywood : సందీప్ వంగా దర్శకత్వంలో అల్లూ అర్జున్ సినిమా

Tollywood : సందీప్ వంగా దర్శకత్వంలో అల్లూ అర్జున్ సినిమా
X
సినిమా షూటింగ్‌ను 2024లో మొదలు పెట్టి.. 2025లో విడుద‌ల‌య్యేలా మేక‌ర్స్ ప్లాన్స్ చేసుకుంటున్నారు

పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్‌ సంపాదించుకున్న ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌.. తన నెక్స్ట్‌ మూవీ అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి.సిరీస్ బ్యాన‌ర్‌పై భూష‌ణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టి.సిరీస్‌ ఫిల్మ్స్‌.. భద్రకాళి పిక్చర్స్‌ ప్రొడక్షన్‌ నిర్మిస్తున్నఈ పాన్ ఇండియా మూవీ... భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కనుంది.

అర్జున్ రెడ్డి వంటి ఇన్‌టెన్స్ ల‌వ్‌స్టోరీతో తెలుగులో బ్లాక్ బస్టర్‌ కొట్టిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. దాన్నే క‌బీర్ సింగ్‌గా బాలీవుడ్‌లో రూపొందించి అక్కడ కూడా బ్లాక్ బ‌స్టర్ సాధించారు. మ‌రిప్పుడు సందీప్.. బ‌న్నీని ఎలా చూపించ‌నున్నార‌నేది అందిర‌లోనూ ఆస‌క్తిని పెంచుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను 2024లో మొదలు పెట్టి.. 2025లో విడుద‌ల‌య్యేలా మేక‌ర్స్ ప్లాన్స్ చేసుకుంటున్నారట. ఈలోపు సందీప్ వంగా.. ప్రభాస్‌ 25వ సినిమా స్పిరిట్‌ను పూర్తి చేయనున్నారు.

Tags

Next Story