Tollywood : డార్క్ కామెడీగా "సత్తిగాని రెండెకరాలు" టీజర్ రిలీజ్

X
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. ప్రేక్షకులను టీజర్ ఎంతగానో ఆకట్టుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

పుష్ప ఫేం జగదీష్ హీరోగా "సత్తిగాని రెండెకరాలు" సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను అభినవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. ప్రేక్షకులను టీజర్ ఎంతగానో ఆకట్టుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డార్క్ కామెడీగా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో సత్తి దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెంది ఉంటాడు. అతడికి ఇద్దరు పిల్లలు. చిన్న బిడ్డకు గుండెకు సంబంధించిన అనారోగ్యం ఉంటుంది. వైద్యం చేయించడానికి కనీసం రూ.25లక్షలు అవసరం అవుతుంది. దీంతో సత్తి నడుపుకుంటున్న ఆటో అమ్మేస్తాడు. ఉన్న రెండెకరాల పొలాన్ని అమ్మడానికి చూస్తాడు.



అంతలోనే ఓ కారులో మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ను వెన్నెల కిషోర్ చేసినట్లుగా షాట్ కట్ అవుతుంది. అయితే మర్డర్ ను తానే చేసినట్లుగా తనభార్యకు చెబుతాడు సత్తి. అప్పటికే సత్తి పొలాన్ని 35 లక్షలకు కొనేందుకు పార్టీ వస్తుంది. అయితే మర్డర్ లో తన హస్తం ఉండటంతో ఇటు బిడ్డను కాపాడుకుంటాడా లేక అటు మర్డర్ ప్రాబ్లమ్ ను ఎదుర్కొంటాడా అని ఆసక్తిని రేపాడు డైరెక్టర్. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ పాత్ర ఏమిటి..? చివరికి ఏమవుతుంది ..? అనే సస్పెన్స్ టీజర్ లో క్రియేట్ అయింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రిమూవీ మేకర్స్, ఆహా ఓటీటీతో కలిసి నిర్మించింది. ఈ సినిమాను మార్చి 17 న ఆహా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.


https://www.youtube.com/watch?v=XYn43Yqyryc

Tags

Next Story