Tollywood : "దోచేవారెవరురా" మూవీ రివ్యూ

Tollywood : దోచేవారెవరురా మూవీ రివ్యూ
X

మనీ, సిసింద్రీ వంటి చిత్రాలు తీసిన దర్శకులు శివనాగేశ్వరరావు చాలా కాలం తర్వాత మెగా ఫోన్ పట్టారు. ఆయన దర్వకత్వం వహించిన చిత్రం “దోచేవారెవరురా” థియేటర్లకు వచ్చింది. ఇందులో గీత రచయిత చైతన్య ప్రసాద్ తనయుడు ప్రణవ చంద్ర హీరోగా, మాళవిక సతీశన్ హీరోయిన్ గా నటించారు. ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్, ప్రముఖ యూట్యూబర్ ప్రణతి సాధనాల ముఖ్య పాత్రలు చేశారు. వీరితో పాటు బిత్తిరి సత్తి ప్రధానాకర్షణగా నిలిచారు.


కథ :
సీనియర్ సిద్దు (ప్రణవ చంద్ర), జూనియర్ సిద్దు (బాల కళాకారిణి చక్రి) జీవనోపాధి కోసం దొంగతనం చేస్తారు. సిద్దు, సీనియర్ లక్కీ ( మాళవిక సతీషన్ ) ను కలుస్తాడు. వారు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. లక్కీ సమస్యలను దూరం చేయడానికి సిద్దు నిర్ణయించుకుంటాడు. ఇంతలోనే విమల్ (అజయ్ ఘోష్) తన భార్య పార్వతి ( ప్రముఖ యూట్యూబర్ ప్రణవి సాధనాల )ను హత్య చేయించడానికి రెడీ అవుతాడు. అందుకు పీకే సత్తి ( బిత్తిరి సత్తి )ని నియమిస్తాడు. అయితే విమల్ తన భార్యను చంపించడాని గల కారణం ఏమిటి ? సత్తికి, సిద్దుకు సంబంధం ఏమిటి ? అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవలసిందే.


ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు శివనాగేశ్వరావు చాలా కాలం తర్వాత దర్శకత్వం వహించిన ఈ సినిమా కామేడీతో రూపొందించారు. శివనాగేశ్వరరావు ఎక్కువగా విలన్ మరియు అతని బ్యాక్ స్టోరీపై ఎక్కువ దృష్టి పెట్టాడు. ఇది కథలో కీలకంగా నిలిచింది.
హీరో ప్రణవ చంద్ర తన తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నాడు. హావభావాలు చక్కగా పలికించాడు. హీరోయిన్ మాళవిక సతీశన్ చిత్రానికి ప్లస్ పాయింట్స్ గా నిలిచింది. ఇరువురి కెమిస్ట్రీ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. చైల్డ్ ఆర్టిస్ట్ చక్రీ తన బెస్ట్ ను అందించాడు.ఇప్పటివరకు సపోర్టింగ్, విలన్ పాత్రలు చేసిన అజయ్ ఘోష్ ఈ సినిమాలో లీడ్ రోల్ చేశారు. ద్విపాత్రాభినయం చేశారు. ఈయనకు జంటగా ప్రముఖ యూట్యూబ్ ఫేం ప్రణతి సాధనాల నటించారు. ప్రణతికి వెండితెర కొత్తదైనా తన నటనతో ఆకట్టుకున్నారు.

ప్రణతి సాధనాల హత్య చుట్టే దర్శకుడు క్రైం కామెడీని పండించడానికి ప్రయత్నించారు. అజయ్ ఘోష్, తనికెళ్ల భరణి, బిత్తిరి సత్తి తమ క్యారెక్టర్లలో ఇమిడి పోయారు. ప్రముఖ యూట్యూబర్ ప్రణతి సాధనాల ఇప్పటికే తన హావభావాలతో నెటిజన్లను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వెండి తెరపైనా తన నటనను ప్రదర్శించింది.



మైనస్ పాయింట్లు
కామెడీ డ్రామాను ఎంచుకోవడం శివనాగేశ్వరరావు మైనస్ అని చెప్పవచ్చు. చాలా కాలం తర్వాత మెగా ఫోన్ పట్టుకోవడంతో అభిమానుల అంచనాలను దర్శకుడు అందుకోలేదని తెలుస్తోంది. సినిమాలో నవ్వు తెప్పించే అంశాలు ఉన్నప్పటికీ కథ ఫ్లాట్ గా నడిచింది. బిత్తిరి సత్తి, తనికెళ్ల భరణి పోషించిన పాత్రలపై దర్శకుడు మరింత దృష్టి పెడితే బాగుండేది. మొత్తం మీద దోచేవారెవరురా అభిమానుల, సినీ ప్రేక్షకుల మనసును సగమే దోచినట్లు తెలుస్తోంది.

Tags

Next Story