Tollywood : 'కలెక్షన్ కింగ్' కు జన్మదిన శుభాకాంక్షలు

Tollywood : కలెక్షన్ కింగ్ కు జన్మదిన శుభాకాంక్షలు
చిత్తూరుజిల్లా మోదుగులపాలెం గ్రామంలో 1952 మార్చి 19 న జన్మించిన‌ మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి ఎందరికో ఆదర్శమయ్యారు

విలక్షణ నటుడు పద్మశ్రీ డా. మోహన్ బాబు పుట్టినరోజు నేడు. తెలుగు ప్రేక్ష‌కుల గుండేల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నిత్య నూతన కళాకారుడు మోహన్ బాబు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు, రాజకీయనాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిత్తూరుజిల్లా మోదుగులపాలెం గ్రామంలో 1952 మార్చి 19 న జన్మించిన‌ మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి ఎందరికో ఆదర్శమయ్యారు.


'స్వర్గం నరకం' చిత్రంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన మోహన్‌బాబు 573 చిత్రాలకు పైగా నటించి నవరసాలు పండించాడు. ఆయన హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. అల్లుడుగారు , అసెంబ్లీ రౌడి , రౌడీ గారి పెళ్ళాం , మోహన్ బాబు ని హీరోగా నిలబెట్టాయి. ఆ తరవాత వచ్చిన అల్లరి మొగుడు, బ్రహ్మ , మేజర్ చంద్రకాంత్, సినిమాలతో స్టార్ హీరోగా 'కలెక్షన్ కింగ్' గా పేరు తెచ్చుకున్నాడు. 'పెదరాయుడు' ఇండస్ట్రి హిట్ గా నిలిచింది. శ్రీ రాములయ్య , అడవిలో అన్న తో మోహన్ బాబు లో మరో నటుడిని ప్రేక్షకులకు చూసారు. వీటితోపాటే 216 చలన చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించారు. తాజాగా మోహన్ బాబు నటించిన శాకుంతలం రిలీజ్ కు రెడీగా ఉంది. మంచు అభిమానులు తమ అభిమాన నటుడిని, హీరోను మరోసారి పౌరాణిక పాత్రలో చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ సందర్భం దగ్గరలోనే ఉంది.

Tags

Read MoreRead Less
Next Story