Jagapathi Babu :అవయవదానం చేసేవారికి పద్మ పురస్కారాలు ప్రధానం చేయాలి : జగపతి బాబు

Jagapathi Babu : సినిమాలోని కథానాయకులు నిజమైన హీరోలు కాదని... అవయవదానం చేసి పదిమందికి జీవితాన్ని ఇచ్చిన వారే నిజమైన హీరోలని సినీ నటుడు జగపతి బాబు అన్నారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో జగపతిబాబు 60 వ పుట్టిన రోజు సందర్భంగా తనతో పాటు వంద మంది అభిమానులు అవయవదానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ.. చనిపోయాక 200 గ్రాముల బూడిద తప్ప ఇంకేం మిగలదని అన్నారు. అవయవదానంతో మరణించన తర్వాత ఏడు, ఎనమిది మందికి పునర్జన్మ ఇవ్వొచ్చునని అన్నారు. ఇక అవయవదానం చేసేవారికి పద్మ పురస్కారాలు ప్రధానం చేయలని పేర్కొన్నాడు. తాను సినిమాలో హీరో అయినా, విలన్ అయినా నిజజీవితంలో హీరోలాగే బతకాలనుకుంటున్నానని .. హీరోలాగే తన అవయవాలను దానం చేస్తున్నానని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com