Naresh Press Meet: నాగబాబు మాటలు నన్ను బాధించాయి: నరేష్

Naresh Press Meet: నాగబాబు మాటలు నన్ను బాధించాయి: నరేష్
నాగబాబు నాకు మంచి మిత్రుడు.. 'మా'కు సంబంధించి ఏ కార్యక్రమం చేసినా చిరంజీవి, నాగబాబుకు చెప్పి చేశాం.

Naresh Press Meet: నాగబాబు నాకు మంచి మిత్రుడు.. 'మా'కు సంబంధించి ఏ కార్యక్రమం చేసినా చిరంజీవి, నాగబాబుకు చెప్పి చేశాం. అయినా నాలుగేళ్లుగా మా మసకబారిపోయింది అని నాగబాబు అనడం నన్ను బాధించింది అని నరేష్ శనివారం జరిగిన ప్రెస్ మీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రకాష్ రాజ్, నాగబాబు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లకు కౌంటర్‌గా నరేష్ శనివారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా గత రెండేళ్లలో తాను 'మా' లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

నాకు కథలు చెప్పడం అలవాటు లేదు. కాగితాలతో రావడమే అలవాటు. ఎవర్నో దూషించడానికో, ఎవరిపైనో కాలుదువ్వడానికో ఈ సమావేశం ఏర్పాటు చేయలేదు. నేను ఏంటనేది చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను సినిమా బిడ్డను. సినీ పరిశ్రమకు ఎప్పుడు సమస్య వచ్చినా 'మా' కుటుంబం ముందు ఉంది. మూడు నెలల క్రితమే ప్రకాష్ నన్ను కలిసి మా ఎలక్షన్లకు పోటీ చేస్తున్నట్లు చెప్పాను. తెలుగు సినిమాల్లో నటించే వాళ్లు ఎవరైనా పోటీ చేయవచ్చని చెప్పాను. మంచు విష్ణ కూడా ఇండస్ట్రీ బిడ్డ. కష్టనష్టాలు చూడకుండా వరుస సినిమాలు చేస్తూ వేలాది మందికి అన్నం పెడుతున్నారు అని నరేష్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story