Prudhvi Raj : పవన్ కళ్యాణ్‌కి అందరి దిష్టి తగిలి ఉంటుంది : 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ

Prudhvi Raj : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ భీమ్లానాయక్.. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచే కాకుండా సినీ సెలబ్రిటీల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
పవన్, రానా నటనకి గాను ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా సినీ నటుడు పృథ్వీరాజ్ ఓ యూట్యూబ్ ఛానల్‌లో భీమ్లానాయక్ సినిమా పైన ప్రశంసలు కురిపించారు. భీమ్లానాయక్ చిత్రాన్ని చూశానని, ఒక ప్రేక్షకుడిలా ఈ చిత్రాన్ని ఫుల్ ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చారు. పవన్, రానా కాంబోలో వచ్చిన సన్నివేశాలు గొప్పగా ఉన్నాయని తెలిపారు. అయితే సినిమా చూస్తున్నంతసేపు, ఒక రకమైన బాధలో ఉండిపోయానని, ఇంతమంచి సినిమాలో తాను నటించలేదన్న బాధ ఉందని అన్నారు.
అప్పట్లో ఎన్టీఆర్ 'అడవి రాముడు' సినిమా రిలీజైనప్పుడు తాడేపల్లిగూడెంలోని విజయాటాకీస్‌కు వెళ్తే అక్కడ భారీగా తరలివచ్చిన అభిమానుల్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మళ్ళీ అలాంటి క్రేజ్ పవన్ కళ్యాణ్‌కి మాత్రమే చూశానని అన్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్‌ని ఇలాంటి పాత్రలో చూసి అందరి దిష్టి తగిలి ఉంటుందని, ఆయనకు అది తగలకూడదని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు పృథ్వీరాజ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com