Mirchi Sampath : ఆ నటి నా భార్య కాదు.. క్లారిటీ ఇచ్చిన సంపత్

Mirchi Sampath : ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు సంపత్.. ఆ సినిమాతో ఆయన పేరు మిర్చి సంపత్‌గా మారిపోయింది. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాలలో నటించి ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. అయితే ఇటీవల అలీతో సరదాగా షోకి గెస్ట్‌గా వచ్చిన సంపత్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
తమిళ్ ఆర్టిస్ట్ శరణ్య.. తనకి, తన కుటుంబానికి మంచి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు. తాను శరణ్య కలిసి ఓ సినిమాలో కలిసి కపుల్స్‌గా నటించామని, దీనితో ఆమెను తన మాజీ భార్యగా పేర్కొంటూ కొన్ని ఫేక్ వార్తలు పుట్టుకొచ్చాయని చెప్పుకొచ్చాడు. ఇందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ పైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు సంపత్.
త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇవ్వకపోతే లొకేషన్‌కు వచ్చి కెమెరా ఎత్తుకెళ్లిపోతానని వార్నింగ్ కూడా ఇచ్చానని చెప్పుకొచ్చాడు.. త్రివిక్రమ్ ఎక్కడుంటాడో సునీల్‌ను ఆరా తీయగా ఆయనకో ఆఫీసు ఉందని, అక్కడికి వెళ్లమని సూచించాడని పేర్కొన్నాడు. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com