లంబోర్ఘిని కారుతో ఎన్టీఆర్.. మరో స్పెషల్ గెస్ట్.. ఫోటో వైరల్

NTR: సినీ సెలబ్రెటీలు ఖరీదైన కార్లు, వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం అత్యంత ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేసి దేశంలోనే తొలి వ్యక్తిగా నిలిచాడు. దేశంలో లాంచ్ చేసిన తొలి రోజే ఈ కారును ఎన్టీఆర్ బుక్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్యూల్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్టీఆర్ తాజాగా తన లంబోర్ఘినితో ఫోజు ఇచ్చాడు. ఈ ఫోటో ఇద్దరు ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు. హీరో శ్రీకాంత్, టీడీపీ తరుపున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన చలమశెట్టి సునీల్ ని ఎన్టీఆర్ తో కలసి చూడవచ్చు. ఈ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ 3,16 కోట్ల రూపాయల విలువ చేసే ఈ కారు బుల్లెట్ ఫ్రూవ్ అని కూడా చెబుతున్నారు. ఫుల్లీ ఆటోమెటెడ్, సెఫ్టీతో లంబోర్ఘినిని తయారు చేశారు.అయితే ఇప్పటికే ఎన్టీఆర్ గ్యారేజ్ 20పైగా కార్లు ఉన్నాయట.
ఇటలీకి చెందిన వోక్స్ వాగన్ కంపెనీ అనుబంధ సంస్థయే 'లంబోర్ఘిని'. ప్రపంచ వ్యాప్తంగా గతేడాది ఈ కార్లను ఉత్పత్తి చేయగా.. ఇండియాలో సోమవారం రోజున దీనిని అధికారింగా లాంచ్ అయ్యింది. 200 కిమీ వేగంతో వెళుతున్నప్పటికీ ఎలాంటి కుదుపులు ఉండవట. పైగా 2 నిమిషాల్లో 200 స్పీడుకు వెళ్లి.. మళ్లీ 1 నిమిషంలో 10 కి.మీ తగ్గించినా ఎలాంటి ఒడిదుడుకులు లోను కాదట. ఆటో సెన్సర్ మిషన్స్ కూడా ఉండటంతో ఎదురుగా వాహనాలు ఉంటే అలర్ట్ చేస్తుందట. ఆటోమేటేడ్ కారు తాళాలు ఈ కారు ప్రత్యేకత. ఎలాంటి ప్రమాదం జరిగిన కారు అద్దాలు, కానీ డోర్‌లు కానీ అంత ఈజీ తెరచుకు ఇదే దీని ప్రత్యేకత.
ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ సినిమాల్లో బీజీగా ఉంటూనే ఎవరు మీలో కోటీశ్వరులు షో చేశారు. ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసింది. ఎన్టీఆర్ తదుపరి కొరటాల దర్శకత్వంలో రెండవసారి నటించేందుకు రెడీ అవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com