ఈ ఫొటోలో చిన్నారిని గుర్తుపట్టారా..? పవర్ స్టార్‎తో కలిసి నటించింది

ఈ ఫొటోలో చిన్నారిని గుర్తుపట్టారా..? పవర్ స్టార్‎తో కలిసి నటించింది
Tollywood: సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కొంత మంది స్టార్ హీరోయిన్స్ అయితే వారి ఫోటోలను ఇన్ స్టా‎గ్రామ్ లో అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక తాజాగా ఓ హీరోయిన్ ఫోటో వైరల్ అవుతుంది. నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. కొందరైతే గుర్తుపట్టేసి హింట్స్ కూడా ఇస్తున్నారు. ఈ ఫోటోలో ఉంది తెలుగు హీరోయిన్ అంజలి. అంజలి నటన, అందం , అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ.. హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించింది. టాలీవుడ్ లో ఇప్పటివరకు తెలుగు అమ్మాయి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా అరుదు.

టాలీవుడ్ అగ్రహీరోలు వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించారు. అంజలి ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఆ సినిమాలో అంజలి నటన అందరిని ఆకర్షించింది.


Tags

Read MoreRead Less
Next Story