ఈ ఫోటోలో చిన్నారిని గుర్తుపట్టారా..? ఓవర్ నైట్‎లో స్టార్ హీరోయిన్..!

ఈ ఫోటోలో చిన్నారిని గుర్తుపట్టారా..? ఓవర్ నైట్‎లో స్టార్ హీరోయిన్..!
Tollywood: సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Tollywood: సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంత మంది స్టార్ హీరోయిన్స్ అయితే వారి ఫోటోలను ఇన్ స్టా‎గ్రామ్ లో అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక తాజాగా ఓ హీరోయిన్ ఫోటో వైరల్ అవుతుంది. నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. కొందరైతే గుర్తుపట్టేసి హింట్స్ కూడా ఇస్తున్నారు. ఈ ఫోటో ఉన్న ముద్దుగుమ్మను మీరు గుర్తుపట్టారా..? గుర్తుపట్టలేకపోతే కింద ఫోటో చూడండి.

ఈ ఫోటో కనిపిస్తుంది ఎవరో కాదు కృతిశెట్టి. కృతిశెట్టి చిన్నతనంలో దిగిన ఫోటోనే అది. కృతిశెట్టి 'ఉప్పెన' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తన నటన, అభినయంతో ప్రేక్షకులను ఆకర్షించింది. ఆ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ సినిమాలతో బిజీ గా ఉంది. ఈ సినిమాలో విడుదలైన తొలి సాంగ్ "నీ కళ్ళు నీలి సముద్రం" పాట కృతిశెట్టి కి ఎంతగానో క్రేజ్ తెచ్చిపెట్టింది. కృతి ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, బంగార్రాజు తోపాటు లింగు స్వామి మూవీలో కూడా నటిస్తుంది.
Tags

Read MoreRead Less
Next Story