స్టార్‌ హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ ఇప్పుడెలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా ?

స్టార్‌ హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ ఇప్పుడెలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా ?
Meera Jasmine: ఒకప్పటి హీరోయిన్ మీరా జాస్మీన్ వాటికి భిన్నంగా ఉండే పాత్రలు ఎంపిక చేసుకున్నారు.

Meera Jasmine: సినిమాల్లో నటించే హీరోయిన్స్ కాస్తకూస్తో గ్లామర్ షో చూపించాల్సిందే. అయితే ఒకప్పటి హీరోయిన్ మీరా జాస్మీన్ వాటికి భిన్నంగా ఉండే పాత్రలు ఎంపిక చేసుకున్నారు. టాలీవుడ్ అగ్రహీరోలతో కలిసి నటించింది. పవన్ కళ్యాణ్, రవితేజ, బాలకృష్ణ వంటి అగ్రకథానాయకులతో స్ర్కీన్ షేర్ చేసుకుంది. ఆమె నటించిన సినిమాల్లో చాలా వరకు విజయం సాధించినవే.

మీరాజాస్మిన్ 1982 ఫిబ్రవరి 15న కేరళలోని తీరువల్లలో ఓ సిరియన్‌ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఈమె అసలు పేరు జాస్మిన్‌ మేరి జోసెఫ్‌. కేరళ కుట్టికేరళ కుట్టి2001లో సినీ పరిశ్రమకు వచ్చిన మీరాజాస్మిన్..2004లో హీరో శివాజీతో క‌లిసి 'అమ్మాయి బాగుంది'లో నటించి మెప్పించింది. భద్ర, గుడుంబా శంకర్, గోరింటాకు, పందెం కోడి వంటి సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకుంది. తెలుగుతో పాటు మలయాళం, త‌మిళ భాషల్లో న‌టించిన జాతీయ ఉత్త‌మ న‌టిగా గుర్తింపు పొందింది.

2014లో దుబాయ్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయింది.అయితే వివాహం తర్వాత తలెత్తిన విబేధాల కారణంగా మీరా.. తన భర్తతో విడిపోయింది. ఇప్పుడు మీరా జాస్మీన్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.

బొద్దు గా ఉన్న మీరాజాస్మిన్ సన్నబడింది. వర్కౌట్స్ బాగా చేస్తూ తన శరీర బరువును బాగా తగ్గించుకుంది. సన్నబడిన మీరాజాస్మిన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె అభిమానులు మీరా జాస్మిన్ రీ ఎంట్రీ ఇస్తుందని ఎదురుచూస్తున్నారు. అయితే మీరా జాస్మిన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది చూడాలి. మీరాజాస్మిన్‌ తెలుగులోకి రిలీజైన్ డబ్బింగ్ మూవీ 'రన్‌'తో పరిచ‌య‌మైంది.Tags

Read MoreRead Less
Next Story