Raashi Khanna : గ్యాస్ ట్యాంకర్ అంటూ అవహేళన చేశారు : రాశీఖన్నా

Raashi Khanna : తనని దక్షిణాది వాళ్లు గ్యాస్ టాంకర్ అని అవహేళన చేశారని షాకింగ్ కామెంట్స్ చేసింది రాశీఖన్నా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. కెరీర్ మొదట్లో మంచి పాత్రల్లో నటించే అవకాశం వచ్చిందని.. అందుకు సంతోషిస్తానని అంది.
అయితే శరీరాకృతి పరంగా తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని తెలిపింది. చూడడానికి లావుగా ఉండడంతో చాలా మంది తనని గ్యాస్ ట్యాంకర్ అని పిలిచేవారని, ఆ తర్వాత సన్నగా మరాలాని నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. వృత్తి కోసం సన్నగా అవ్వాలని అనుకున్నాను కానీ.. కామెంట్స్ చేసిన వారి నోళ్లు మూయించడం కోసం కాదని చెప్పుకొచ్చింది.
తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన రాశీఖన్నా.. ఆ తరవాత జైలవకుశ, సుప్రీమ్, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే చిత్రాలలో నటించి మెప్పించింది. ప్రస్తుతం నాగచైతన్య సరసన థాంక్ యూ చిత్రంలో నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com