Samantha: శరీరం ఉత్తేజంగా.. మనసు ప్రశాంతంగా.. సమంత చెప్పిన ఆరోగ్య చిట్కాలు..

Samantha: ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి.. బాధ మరొకరిది అయినప్పుడు ఓదార్చడం తేలిక. మనదే అయినప్పుడు ఓర్చుకోవడం చాలా కష్టం. స్టార్ హీరోయిన్ అయినా ఆమె కూడా ఓ మామూలు మనిషే. అందరి మాదిరిగానే ఏదైనా సమస్య వచ్చినప్పుడు కృంగి పోతుంది.. కానీ మిగిలిన జీవితం గడపాలంటే ఒత్తిడిని జయించాలి.. సమస్యని అధిగమించాలి. అందుకోసం ఊరడించే వ్యక్తులు తోడున్నా తనని తాను సంభాళించుకుంటూ ముందుకు సాగుతోంది. యోగా, ధ్యానం, పర్యాటక ప్రదేశాలు చుట్టి రావడం, స్నేహితులతో సరదాగా గడపడం చేస్తోంది. సినిమాల్లో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటోంది.
తన దిన చర్యను వ్యాయామంతో ప్రారంభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంచేందుకు ధ్యానం, యోగా, తేలికపాటి వర్కవుట్స్ ఉపకరిస్తాయని అంటోంది.
తన ఫిట్‌నెస్‌లో పోషకాహారానికి పెద్ద పీట వేస్తుంది. ఎక్కువగా ఆకు కూరలు ఆహారంలో భాగం చేసుకుంటుంది. వ్యాయామ సెషన్‌కు ముందు ఉదయం ప్రోటీన్ షేక్ లేదా గుడ్లు తీసుకోవడం అలవాటు. మన జీవన శైలి, మన ఆహారపు అలవాట్లే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.. ఇది అందరికీ వర్తిస్తుంది అని సామ్ చెప్పుకొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com