ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌‌ని గుర్తుపట్టండి చూద్దాం.. ఇప్పుడు హీరోయిన్.. !

ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌‌ని గుర్తుపట్టండి చూద్దాం.. ఇప్పుడు హీరోయిన్.. !
చైల్డ్ ఆర్టిస్ట్‌లు హీరోలుగా, హీరోయిన్లుగా మారడం అనేది ఇండస్ట్రీలో సహజమే.. మీనా, తరుణ్ నుంచి మొన్న వచ్చిన తేజ సజ్జా వరకు అందరూ ఆలా అయినవారే..

చైల్డ్ అరిస్ట్‌లు హీరోలుగా, హీరోయిన్లుగా మారడం అనేది ఇండస్ట్రీలో సహజమే.. మీనా, తరుణ్ నుంచి మొన్న వచ్చిన తేజ సజ్జా వరకు అందరూ ఆలా అయినవారే.. అలాంటి లిస్టులోకే వస్తుంది శ్రీదివ్య కూడా... మూడేళ్ళ వయసు నుండే నటించడం మొదలు పెట్టింది శ్రీదివ్య ..హనుమాన్ జంక్షన్ ఆమెకి మొదటి సినిమా.. ఆ తర్వాత యువరాజ్, వీడే లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కూడా చేసింది. ఆ తర్వాత హీరోయిన్‌‌గా టర్న్ అయింది. 2010లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన మనసారా సినిమాలో తొలిసారిగా హీరోయిన్‌‌గా నటించింది.


ఆ తర్వాత బస్ స్టాప్, కేరింత సినిమాలలో హీరోయిన్‌‌గా నటించింది. ఆ తర్వాత తెలుగుతో పాటుగా తమిళ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అవకాశాలు దక్కించుకుంది ఈ భామ. విశాల్, కార్తీ,శివకార్తికేయన్‌‌‌ లాంటి హీరోలతో జోడి కట్టి మంచి అక్కడ ఫేం సంపాదించుకుంది. ఇదిలావుండగా శ్రీదివ్యకి సంబంధించిన ఓ రేర్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. యువరాజు సినిమాలో మహేష్‌‌బాబు ఎత్తుకున్న ఫోటోలో శ్రీదివ్య కనిపిస్తుంది. ఈ ఫోటోని గమనిస్తే మహేష్‌‌బాబులో అప్పటికి ఇప్పటికి ఎలాంటి తేడా కూడా తేడా లేదు కానీ శ్రీదివ్య మాత్రం హీరోయిన్‌‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story