వామ్మో..తమన్నా గౌను ధర ఎంతో తెలుసా..? కారు కొనొచ్చు..!

Tamannaah Bhatia: టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకత ఏర్పరుచుకున్నారు. ఓ ఫొటోషూట్ కోసం తమన్నా సైతం అత్యంత ఖరీదైన దుస్తుల్ని ధరించారు. తొలి సినిమా 'శ్రీ' తో తెలుగు తెరకు పరిచయడం అయింది ఈ మిల్కీబ్యూటీ. 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'హ్యాపీడేస్'తో తమన్నాకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలతో ఫుల్ బిజీగా ఉంటున్న తమన్నాకు తాజాగా షూటింగ్స్ నుంచి చిన్న విరామం దొరికింది. ఫొటోషూట్స్‌తో కాలక్షేపం చేస్తున్నారు. తమన్నా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ధరించిన డ్రెస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె ధరించిన డ్రెస్సుల్లో బ్లాక్ కలర్ గౌను అందర్నీ ఎంతో ఆకర్షించింది. తమన్నా ధరించిన డ్రెస్ ధర ఎంత ఉంటుందో తెలుసుకోవాలని నెటిజన్లు భావించారు. FarFetch.com అనే వెబ్‌సైట్‌లో ఆ డ్రెస్ గురించి సెర్చ్ చేశారు. దాని ధర తెలుసుకొని ఆశ్చర్యానికి గురైయ్యారు. తమన్నా ధరించిన గౌను ఖరీదు ఐదు వేల యూఎస్ డాలర్లుగా ఉంది. దాంతో నెటిజన్లు తమన్నా గౌను ధర కంటే కారు కొనొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com