Brahmanandam Assets : బ్రహ్మానందానికి ఉన్న ఆస్తి ఎంత.. ఒక్కో సినిమాకి ఆయన రెమ్యునరేషన్ ఎంత?

Brahmanandam Assets : హీరోలతో పాటుగా సరిసమానమైన స్టార్ స్టేటస్ కలిగి ఉన్న ఏకైక కమెడియన్ బ్రహ్మానందం అని చెప్పడంలో సందేహం అస్సలు అక్కర్లేదు.. కొన్ని సినిమాలు బ్రహ్మానందం వల్లే సక్సెస్ అయ్యాయి కూడా... లెక్చరర్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా ఎదిగారు బ్రహ్మానందం.. అతి తక్కువ టైంలో ఏకంగా వెయ్యికి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ రికార్డులోకి ఎక్కారాయన.
అయితే కరోనా లాంటి మహమ్మారి స్ప్రెడ్ అవుతున్న సమయంలో ఆయన ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు.. ఇంట్లోనే ఉంటున్నారు. కొడుకు, మనవళ్ళతో కలిసి కాలాన్ని గడుపుతున్నారు. బ్రహ్మానందంకి సినిమాలతో పాటుగా డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం.. ఖాళీ సమయంలో ఎక్కువగా డ్రాయింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఆయన గీసిన డ్రాయింగ్స్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాయి.
ఇదిలావుండగా టాప్ కమెడియన్‌గా ఉన్నప్పుడు బ్రహ్మానందం రెమ్యునరేషన్ ఎంత? ఆయన ఆస్తి విలువ ఎంత అని ఇప్పుడు నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. సెలబ్రిటీల విషయంలో ఫ్యాన్ ఫాలోయింగ్‌పైనే సంపాదన అనేది ఆధారపడి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే.. తెలుగుతో పాటుగా మరియు ఇతర బాషల్లో కూడా అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో బ్రహ్మానందం ఒకరు.
ఓ వెబ్ సైట్ కథనం ప్రకారం.. బ్రహ్మానందం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నారు. సొంతూరు సత్తెనపల్లెలో అయిదు కోట్ల విలువైన ఆస్తి ఉంది. చాలా రియల్ ఎస్టేట్ లలో కూడా ఆయన బాగానే ఆస్తులను కలిగి ఉన్నారని తెలుస్తోంది. మొత్తం ఆయన ఆస్తి విలువ సుమారుగా రూ. 340 కోట్లు ఉంటుందని సమాచారం.
ఇక ఆయన ఒక్కో సినిమాకి గాను రూ. కోటి నుంచి రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇక ప్రకటనలకి గాను కోటి రూపాయల వరకు తీసుకుంటారట. ఏడాదికి ఆయన ఆదాయం పాతిక కోట్లు అని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com